అప్పుడు అందంగాలేనని నో చెప్పారు.. కట్ చేస్తే అదే బ్రాండ్‌కు నేను అంబాసిడర్

Updated on: Sep 27, 2026 | 1:59 PM

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం, గ్లామర్, లుక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీంతో కెరీర్ ప్రారంభంలో చాలామంది నటీమణులు ఎన్నో తిరస్కరణలు, విమర్శలు, అవమానాలను ఎదుర్కొంటారు. అయితే అలాంటి మాటలనే స్ఫూర్తిగా తీసుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా చాలామందే ఉన్నారు.

1 / 5
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం, గ్లామర్, లుక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీంతో కెరీర్ ప్రారంభంలో చాలామంది నటీమణులు ఎన్నో తిరస్కరణలు, విమర్శలు, అవమానాలను ఎదుర్కొంటారు. అయితే అలాంటి మాటలనే స్ఫూర్తిగా తీసుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శోభిత ధూళిపాళ్ల.

2 / 5
మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి వచ్చిన శోభిత.. తన అందం, నటన, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. శోభిత తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ.. ఓ ప్రముఖ బ్రాండ్ యాడ్ కోసం ఆడిషన్‌కు వెళ్లిన సమయంలో తనను ఎంపిక చేయలేదని తెలిపారు. తాను అందంగా, ఆకర్షణీయంగా లేనని భావించి కనీసం బ్యాక్‌గ్రౌండ్ మోడల్‌గా కూడా తీసుకోలేదని ఆమె అన్నారు

3 / 5
తనను ఒకప్పుడు తిరస్కరించిన అదే బ్రాండ్‌కు కొన్నేళ్ల తర్వాత బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసే అవకాశం శోభితకు లభించింది. ఈ విషయాన్ని ఆమె గతంలో ఎంతో ఆనందంగా పంచుకున్నారు. “అప్పుడు నన్ను అందంగా, ఆకర్షణీయంగా లేనని భావించి బ్యాక్‌గ్రౌండ్ మోడల్‌గా కూడా ఎంపిక చేయలేదు. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‌కు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశాను” అంటూ తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

4 / 5
అంతేకాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో కలిసి షాంపూ యాడ్‌లో నటించే అవకాశం కూడా తనకు లభించిందని శోభిత తెలిపారు. ఒకప్పుడు తనను తిరస్కరించిన పరిస్థితుల నుంచి అదే స్థాయికి ఎదగడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. మోడలింగ్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు సినిమా గూఢచారితో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది.

5 / 5
ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం పొన్నియిన్ సెల్వన్ లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా ఆమె మరింత చేరువయ్యారు. వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లారు.అలాగే  టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యతో ఆమె వివాహం జరిగింది. దీంతో శోభిత పేరు తెలుగు సినీ వర్గాల్లో మరింతగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు శోభిత 

Loading...
Unable to load recommendations.
Follow Us