Malayalam Movies: మాలీవుడ్‌లో చిన్న సినిమాలు వండర్స్.. స్టార్ హీరోలకు షాక్స్..

| Edited By: Prudvi Battula

Mar 13, 2024 | 11:31 AM

మాలీవుడ్‌లో చిన్న సినిమాలు వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎలాంటి స్టార్ పవర్‌ లేకపోయినా... ఏ మాత్రం అంచనాలు లేకపోయినా... భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమా జోరు స్టార్ హీరోలకు కూడా షాక్ ఇస్తోంది.ఇప్పటి వరకు మాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసీఫర్‌. సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్ హీరోగా మరో టాప్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ గెస్ట్ రోల్‌లో నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

1 / 5
ఇప్పటి వరకు మాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసీఫర్‌. సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్ హీరోగా మరో టాప్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ గెస్ట్ రోల్‌లో నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఫుల్ రన్‌లో 127 కోట్ల వసూళ్లు సాధించింది.

2 / 5
మోహన్‌లాల్ సినిమా సెట్‌ చేసిన రికార్డును ఓ చిన్న సినిమా చెరిపేసింది. ఇటీవల మలయాళీ  ఆడియన్స్ ముందుకు వచ్చిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ మంజుమెల్‌ బాయ్స్ చిన్న సినిమాగా వచ్చి ఎవ్వరు ఉహించని విధంగా సంచలన విజయం సాధించింది.

3 / 5
ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంజుమెల్‌ బాయ్స్‌, 16 రోజుల్లోనే 130 కోట్ల వసూళ్లు సాధించింది. ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుండటంతో ఈ సినిమా 150 కోట్ల మార్క్‌ను కూడా రీచ్ అవ్వటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

4 / 5
మంజుమెల్‌ బాయ్స్‌ కన్నా వారం ముందు మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి లీడ్ రోల్‌లో నటించిన భ్రమయుగం సినిమా రిలీజ్ అయ్యింది. ఎక్స్‌పరిమెంటల్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్‌ వచ్చింది. అయినా ఈ మూవీ 100 కోట్ల వసూళ్ల మార్క్‌ను టచ్‌ చేయలేకపోయింది

5 / 5
రీసెంట్‌గా రిలీజ్ అయిన మరో మాలీవుడ్ మూవీ కూడా స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ప్రేమలు సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసి బిగ్గెస్ట్ ఎవ్వర్‌ హిట్స్ సరసన నిలిచింది. రీసెంట్‌గా తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.