మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ వస్తే ఆయనకు అమ్మగా నటించాలని ఉంది

Updated on: Nov 24, 2026 | 2:25 PM

ఒకప్పుడు తన సహజమైన అందం, అద్భుతమైన అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన నటి యమున. కెరీర్ పీక్స్‌లో ఉండగా వరుస సినిమాలతో అలరించిన ఆమె, ఆ తర్వాత కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు

1 / 5
ఒకప్పుడు తన సహజమైన అందం, అద్భుతమైన అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన నటి యమున. కెరీర్ పీక్స్‌లో ఉండగా వరుస సినిమాలతో అలరించిన ఆమె, ఆ తర్వాత కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యమున తన సినీ ప్రయాణం, అగ్ర హీరోలతో మిస్ అయిన అవకాశాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

2 / 5
కెరీర్ తొలినాళ్లలో తోటి హీరోయిన్లకు తాను ఎప్పుడూ పోటీగా అనిపించలేదని యమున తెలిపారు. గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ప్రాధాన్యమున్న విభిన్నమైన పాత్రలనే ఎంచుకోవడం వల్ల ఎవరూ తనను పోటీగా భావించలేదని అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. 'మామగారు' సినిమా ఘనవిజయం తర్వాత దాసరి గారి దర్శకత్వంలో వరుస అవకాశాలు వచ్చాయని చెప్పారు. అలాగే 'నాగమ్మ' హిట్ తర్వాత ఎక్కువగా పాము నేపథ్యమున్న కథలే తన వద్దకు వచ్చాయని వివరించారు.

3 / 5
ఇటీవల మళ్లీ సినిమాల్లో నటించమని అవకాశాలు వస్తున్నప్పటికీ, సీరియల్స్‌తో బిజీగా ఉండటం వల్ల వాటిని అంగీకరించలేకపోతున్నానని యమున పేర్కొన్నారు. ఒకే లొకేషన్‌లో, కుటుంబ వాతావరణంలో పనిచేసే వీలుండటంతో తనకు సీరియల్స్ చేయడమే ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు. పాత్రల విషయంలో తనకు ఎలాంటి హద్దులు లేవని, 20 ఏళ్ల క్రితమే ఓ సీరియల్‌లో బామ్మగా నటించానని, ఇప్పుడు అమ్మ, అక్క వంటి ఏ పాత్రలకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. అగ్ర హీరోల సరసన నటించే విషయంపై స్పందిస్తూ.. చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, అయితే ఆ పాత్ర తనకు ఎంతవరకు నప్పుతుందో చూడాలని నవ్వుతూ అన్నారు.

4 / 5
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు అమ్మగా నటించాలనే కోరిక తనకు బలంగా ఉందని, ఆయనను స్క్రీన్‌పై చూసినప్పుడల్లా ఆ తల్లి పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుందని యమున మనసులోని మాట బయటపెట్టారు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించే మూడు భారీ అవకాశాలను కోల్పోయానని యమున ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తనకు సరైన మేనేజర్ లేకపోవడం, డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం తెలియకపోవడం వల్లే ఆ బంపర్ ఆఫర్లు చేజారాయని చెప్పారు.

5 / 5
అయితే 'శ్రీ మంజునాథ' చిత్రంలో చిరంజీవి పక్కన 'గంగ' పాత్రలో చిన్న సన్నివేశంలో నటించడం ద్వారా తన చిరకాల కోరిక కొంతవరకైనా తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే చిరంజీవి గారి నివాసంలో ఆయనతో దాదాపు అరగంట పాటు మాట్లాడిన జ్ఞాపకాలను యమున నెమరువేసుకున్నారు. అప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, నేటి పవర్ స్టార్ వ్యక్తిత్వానికి ఏమాత్రం మార్పు లేదని, ఎదుటివారికి ఇచ్చే గౌరవం, ఆ పవర్ ఇప్పటికీ అలాగే ఉన్నాయని యమున ప్రశంసించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us