Ritu Varma: ఈ కోమలి స్పర్శ తగిలిన ఆ చీరది ఎన్ని జన్మల పుణ్యమో.. రీతు ఆసమ్..

| Edited By: Ravi Kiran

Aug 28, 2024 | 4:28 PM

రీతు వర్మ తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా కథానాయకిగా కనిపించే ఓ భారతీయ నటి. లఘు చిత్రాలు, సహాయ పాత్రలలో కనిపించి పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ తొలిసారి   2016లో హీరోయిన్‎గా చలనచిత్ర అరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డును, ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. తాజాగా ఈ కోమలి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1 / 5
10 మార్చి 1990న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది అందాల తార రీతూ వర్మ. ఈమె తండ్రి మధ్యప్రదేశ్‌కు చెందినవారు. హైదరాబాద్‌లోని విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.

2 / 5
తర్వాత హైదరాబాద్‌లో మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది ఈ బ్యూటీ.

3 / 5
  2013లో ఎన్టీఆర్ బాద్‍షా చిత్రంలో కాజల్ చెల్లెలి పాత్రలో తొలిసారిగా వెండితెరపై కనిపించింది ఈ వయ్యారి. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, నాని ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ.

4 / 5
2016లో విజయ్ దేవరకొండకి జోడిగా పెళ్లి చూపులు చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రెండు ఉత్తమ నటి అవార్డ్స్ పొందింది. తర్వాత కేశవ, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, వరుడు కావలెను, ఓకే ఒక జీవితం వంటి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి.

5 / 5
వేలైల్లా పట్టధారి 2, కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడి, పుతమ్ పుదు కాళై, కణం,నితమ్ ఒరు వానం, మార్క్ ఆంటోనీ వంటి తమిళ చిత్రాల్లో కూడా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో స్వాగ్ సినిమాలో నటిస్తుంది. అలాగే ధృవ నచ్చతిరం: చాప్టర్ 1 – యుద్ధ కాండమ్ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.