
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవలే పెళ్లి పీటలెక్కారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా పెళ్లిపీటలెక్కారు.

విరోష్ (విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా)ల జంట పెళ్లి జరిగి సుమారు 20 రోజులు అవుతున్నా వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదే క్రమంలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే..

తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రష్మి. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఆమెకు స్నేహితులుగా మారారు.

ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోను రష్మిక మందన్న తనకు బ్రదర్‌లా భావిస్తుందట. అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని.

నాని- రష్మికలు దేవదాస్ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటినుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. నానిని ఆమె ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా బ్రదర్‌లా భావిస్తుందట. ప్రస్తుతం ఈ విషయం నెట్టంట తెగ వైరలవుతోంది