
రామ్ చరణ్, ఉపాసన మొదట క్లిన్ కార, పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వీరు మళ్లీ ఇద్దరు కవలలు, పాప, బాబుకు జన్మినిచ్చారు. దీంతో చాలా మంది వీరి జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. అంతే కాకుండా, ఎంతో మంది జ్యోతిష్యులు కూడా వీరి జాతకం గురించి చెబుతున్నారు.

మీరు మహా జాతకులు అంటూ పండితులు, వారి జాతకం గురించి తెలియజేస్తున్నారు. ఉపాసన జనవరి 31న పాప, బాబుకు జన్మనిచ్చింది. అయితే వీరు పునర్వసు నక్షత్రంలో జన్మించారు. ఇది చాలా శుభప్రదమైనది. ముఖ్యంగా శ్రీరాముడు జన్మించిన నక్ష్రతం. వీరు మంచి స్వభావం గల వ్యక్తులంట.

అంతే కాకుండా ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు, జీవితంలో ఉన్నతస్థానానికి ఎదుగుతారని చెబుతున్నారు పండితులు. అలాగే జనవరి 31 శని వారం కావడంతో వీరిపై హనుమాన్ అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట.

అంతే కాకుండా ఈ పిల్లలకు లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుందంట. వీరు చాలా నిశ్శబ్ధంగా కనిపిస్తూనే విజయాలను అందుకుంటారంట. ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. వీరు ఏ పని చేసినా దానిని మధ్యలో ఆపకుండా పూర్తి చేస్తారంట. మరీ ముఖ్యంగా వీరిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి.

అంతే కాకుండా, ఈ పిల్లల రాకతో మెగా కుటుంబంలో సంపద, కీర్తి పెరుగుతుంది. తండ్రికి తల్లికి మంచి పేరు తీసుకొచ్చే పిల్లలుగా ఎదుగుతారు, వృత్తి, విద్యల్లో వీరితో పోటీ పడేవారే ఉండరు అని చెబుతున్నారు పండితులు.