Cinema : సినిమా అంటే ఇది మావ.. ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన మూవీ.. ఓటీటీలో తెగ ట్రెండింగ్..

Updated on: Apr 13, 2026 | 11:27 AM

అమ్మాయి.. గౌరవం కావాలంటే పక్కా డబ్బు ఉండాల్సిందే. స్వేచ్ఛతోపాటు తనకంటూ ఓ గుర్తింపు రావాలి. అందుకు కష్టపడాలి. డబ్బు సంపాదించాలి. ఇవే మాటలు వెండితెరపై చూపించారు. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. స్టార్ హీరోస్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో మీకు తెలుసా..

1 / 5
రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ 'తాయ్ కిళవి' ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై, ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతుంది.

2 / 5
తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఏప్రిల్ 10 (శుక్రవారం) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.  కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా ఈ సినిమాను ప్రతి అమ్మాయి చూడాల్సిందే.

3 / 5
ఈ సినిమా కథ 70 ఏళ్ల వయసున్న పావునుత్తాయి (రాధికా శరత్‌కుమార్) అనే ధైర్యవంతురాలైన మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె గ్రామంలో ఒక కఠినమైన వడ్డీ వ్యాపారిగా గుర్తింపు పొందుతుంది. ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నప్పటికీ, ఆస్తి కోసం వారు నిరంతరం గొడవ పడుతుంటారు. ఆస్తిని పంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేసినా, తాను బ్రతికున్నంత వరకు ఆస్తిని ఎవరికీ ఇవ్వనని ఆమె ఖరాఖండిగా చెబుతుంది.

4 / 5
అయితే, కథలో ఊహించని మలుపు ఏమిటంటే.. పావునుత్తాయి అకస్మాత్తుగా పక్షవాతానికి గురవుతుంది. ఆమె ఎక్కడో రహస్య నిధిని దాచిపెట్టిందని భావించిన ఆమె కొడుకులు, ఆ డబ్బును ఎలాగైనా దక్కించుకోవాలని తిరిగి వస్తారు. స్వార్థపరులైన కొడుకుల మధ్య ఆ వృద్ధురాలు పడ్డ సంఘర్షణ, ఆమె తన ఆస్తిని ఎలా కాపాడుకుంది అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.

5 / 5
స్టార్ హీరో శివకార్తికేయన్ తన స్వంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్ నటన హైలైట్‌గా నిలిచింది. ఆమెతో పాటు సింగంపూలి, అరుణ్ డోస్, బాలా శరవణన్, మునీష్కాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అమ్మాయి డబ్బు సంపాదన, ఆత్మ గౌరవం ఎంత ముఖ్యమనేది ఈ సినిమా చెబుతుంది.

Follow Us