బయ్యర్లను భయపెడుతున్న స్టార్ హీరోలు.. డేంజర్ జోన్‌లోకి నెట్టేస్తున్న నిర్మాతలు

| Edited By: Phani CH

Mar 13, 2024 | 1:15 PM

ఓటిటి వచ్చాక.. అసలే థియెట్రికల్ బిజినెస్ వెంటిలేటర్ మీద ఉంది. ఇప్పుడు దాన్ని మరింత డేంజర్ జోన్‌లోకి నెట్టేస్తున్నారు మన నిర్మాతలు. స్టార్ హీరోలున్నారనే ధైర్యం ఓ వైపు.. రికార్డ్ బిజినెస్ చేయాలని మరోవైపు.. ఈ రెండింటి మధ్య డిస్ట్రిబ్యూటర్లు నలిగిపోతున్నారు. ఎగబడి కొనాల్సిన స్టార్ హీరోల సినిమాల్నే దూరం పెడుతున్నారు బయ్యర్లు. అసలు సమస్య ఎక్కడుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. తెలుగు ఇండస్ట్రీ బిజినెస్ రేంజ్ పెరగడానికి కారణం రాజమౌళి. సినిమా సినిమాకు వందల కోట్ల స్థాయి పెంచేస్తున్నారాయన.

1 / 5
ఓటిటి వచ్చాక.. అసలే థియెట్రికల్ బిజినెస్ వెంటిలేటర్ మీద ఉంది. ఇప్పుడు దాన్ని మరింత డేంజర్ జోన్‌లోకి నెట్టేస్తున్నారు మన నిర్మాతలు. స్టార్ హీరోలున్నారనే ధైర్యం ఓ వైపు.. రికార్డ్ బిజినెస్ చేయాలని మరోవైపు.. ఈ రెండింటి మధ్య డిస్ట్రిబ్యూటర్లు నలిగిపోతున్నారు. ఎగబడి కొనాల్సిన స్టార్ హీరోల సినిమాల్నే దూరం పెడుతున్నారు బయ్యర్లు. అసలు సమస్య ఎక్కడుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

2 / 5
తెలుగు ఇండస్ట్రీ బిజినెస్ రేంజ్ పెరగడానికి కారణం రాజమౌళి. సినిమా సినిమాకు వందల కోట్ల స్థాయి పెంచేస్తున్నారాయన. అది ఆయనకు బాగానే వర్కవుట్ అవుతుంది కానీ మిగిలిన హీరోలకు కాదు. ముందు సినిమాకు 100 కోట్లు వస్తే.. తర్వాతి సినిమాకు 110 కోట్లు బిజినెస్ చేస్తున్నారు. అక్కడే బయ్యర్లకు భయం పుడుతుంది.

3 / 5
ఏ సినిమా అయినా నిర్మాతతో పాటు బయ్యర్ కూడా బాగు పడినపుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అంతేకానీ.. నిర్మాతలొక్కటే సేఫ్ అయిపోయి.. డిస్ట్రిబ్యూటర్లను గాలికి వదిలేస్తే తిప్పలు తప్పవు. అందరు హీరోల సినిమాలు అలా జరుగుతున్నాయి అని కాదు కానీ.. కొన్ని మాత్రం ఇలాగే చేస్తున్నారు. హిట్టైనపుడు ఈ ప్రభావం కనిపించట్లేదు కానీ ఫ్లాపైతే మాత్రం బయ్యర్ పూర్తిగా మునిగిపోతున్నాడు.

4 / 5
ఒకప్పుడు నైజాంలో 40 కోట్లు వస్తే అద్భుతం.. కానీ బాహుబలి 70 కోట్లు, ట్రిపుల్ ఆర్ 100 కోట్లు ఈ ఏరియాలో వసూలు చేసాయి. అలాగే సలార్ 70 కోట్ల వరకు తీసుకొచ్చింది. దాంతో కల్కి, పుష్ప 2 రేట్లు ఆకాశంలోకి వెళ్లాయి. ఇక ఓవర్సీస్‌లో ఈ రెండు సినిమాలకు తలో 100 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడ బిజినెస్ క్లోజ్ కాలేదని ప్రచారం జరుగుతుంది.

5 / 5
స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి.. ఏరియా ఏదైనా హైయ్యస్ట్ బిజినెస్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే రికార్డ్ రేట్స్ చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆ రేట్ పెట్టడానికి వెనకాడుతున్నాడు. ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా టాప్ హీరోల సినిమాలన్నింటికీ వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నా.. అవి వెనక్కి వస్తాయా లేదా అనే భయం కూడా బయ్యర్లలో అలాగే ఉండిపోతుంది.