The Rajasaab: డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌

| Edited By: Phani CH

Jan 15, 2025 | 6:51 PM

సంక్రాంతి రోజు అభిమానులకు షాక్ ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్‌. ఈ సమ్మర్‌కి డార్లింగ్ మూవీ థియేటర్లలో సందడి చేయటం పక్కా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను డైలామాలో పడేశారు. పొంగల్ కానుకగా ది రాజాసాబ్‌ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ అందులో రిలీజ్ డేట్‌ను మెన్షన్ చేయలేదు. కల్కి 2898 ఏడీ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్‌.

1 / 5
కల్కి 2898 ఏడీ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్‌. చాలా కాలం తరువాత ప్రభాస్‌ కామెడీ జానర్‌ ట్రై చేస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

2 / 5
చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్‌. కొద్ది రోజులుగా ది రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.

3 / 5
భారీ గా విజువల్‌ ఎఫెక్ట్స్ వర్క్ ఉండటంతో అనుకున్న టైమ్‌కు రిలీజ్‌ సాధ్యం కాదని, అందుకే దసరాకు రిలీజ్‌ వాయిదా ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. ప్రభాస్ రీసెంట్ రిలీజ్ కల్కి 2898 ఏడీ కూడా గ్రాఫిక్స్ కారణంగానే ఆలస్యమైంది.

4 / 5
తాజాగా పొంగల్ విషెస్ పోస్టర్‌లో రిలీజ్ డేట్‌ లేకపోవటంతో సినిమా వాయిదా పడటం దాదాపుగా కన్ఫార్మ్ అయిపోయింది. అంతేకాదు పోస్టర్‌తో పాటు 'మనం ఎప్పుడొస్తే అప్పుడే పండుగ, త్వరలో చితక్కొట్టేద్దాం' అంటూ కామెంట్ చేశారు.

5 / 5
దీంతో సమ్మర్ రేసు నుంచి ప్రభాస్ తప్పుకున్నట్టే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్‌. సమ్మర్‌ రిలీజ్ లేకపోయినా... కొత్త డేట్ ఎప్పుడన్నది త్వరగా చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.