Payal Rajput: పాపం పాయల్‌.. అరుదైన వ్యాధి తో బాధపడుతున్న ముద్దుగుమ్మ

Edited By: Phani CH

Updated on: May 21, 2025 | 3:22 PM

హెల్త్ ఇష్యూస్‌ ఏం ఉన్నా సరే, ఒకప్పుడు దాచిపెట్టుకోవడానికే ప్రయత్నించేవారు ఎవరైనా. కానీ, ఇప్పులా లేదు సిట్చువేషన్‌. నాకు ఈ ప్రాబ్లమ్‌ ఉంది.. ఫలానా విధంగా ఓవర్‌ కమ్‌ అవుతున్నా.. ఇలా కోపప్‌ అవుతున్నానని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. లేటెస్ట్ గా మరో బ్యూటీ తన కండిషన్‌ గురించి షేర్‌ చేసుకున్నారు.

1 / 5
ఆర్‌.ఎక్స్. 100తో తెలుగు కుర్రకారుకు హాట్‌ ఫేవరేట్‌గా మారిపోయారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా, ఆ సినిమాకు వచ్చినంత పేరు తెచ్చుకోలేకపోయారు. కానీ, ఆ మధ్య వచ్చిన మంగళవారం మాత్రం మళ్లీ  ఈ బ్యూటీని ఫార్మ్ లో నిలబెట్టింది.

2 / 5
మంగళవారం సీక్వెల్‌ ఉంటుందని అజయ్‌ భూపతి చెబుతున్నారు. అయితే, సీక్వెల్‌లో పాయల్‌కి ఎంత వరకు స్కోప్‌ ఉంటుందనే విషయం మాత్రం రివీల్‌ చేయడం లేదు. అంతలో ఇతర ప్రాజెక్టుల మీద ఫోకస్‌ చేస్తున్నారు పాయల్‌.

3 / 5
రీసెంట్‌గా ఓ షో రూమ్‌ ఓపెనింగ్‌కి వెళ్తూ తనకు వచ్చిన సమస్యను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు పాయల్‌. ఈ మధ్య పాయల్‌ కంటి చూపులో తేడా కనిపిస్తోందట. ప్రతిదీ రెండు రెండుగా కనిపిస్తోందట. బ్లర్‌గా కూడా ఉంటోందట.

4 / 5
ఇలాంటి ఇబ్బందుల్లో బయటకు వెళ్లకూడదని అనుకున్నా, ప్రీ కమిట్‌మెంట వల్ల వెళ్లక తప్పడం లేదని, తన సమస్యను బయటకు చెప్పడం ఇష్టం లేక కళ్లజోడుతో మేనేజ్‌ చేశానని అంటున్నారు పాయల్‌.

5 / 5
పాయల్‌ తన సమస్య గురించి చెప్పగానే సమంత మయోసైటిస్‌, ఆదాశర్మ హెల్త్ ఇష్యూస్‌ని డిస్కస్‌ చేసుకుంటున్నారు జనాలు. తనకు ఎలాంటి వాసనలూ తెలియవని, పుట్టుకతో ఈ సమస్య ఉందని కేథరిన్‌ చెప్పిన విషయం కూడా వైరల్‌ అవుతోంది నెట్టింట్లో.