Pawan Kalyan: సినిమాలు కదిలాయి.. మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్..!

Edited By: Phani CH

Updated on: May 13, 2025 | 3:05 PM

పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు.. అవి విడుదల కావు అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ అది తప్పని నిరూపించే పనిలో బిజీ అయిపోయాడు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైంది.. ఇక అస్సలు లేట్ చేయొద్దని ఓ నిర్ణయానికి వచ్చేసాడీయన.

1 / 5
అందుకే వరసగా డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తైపోయింది.. ఇప్పుడు ఓజి వంతు. అయినా అప్పుడంటే అధికారంలో లేడు కాబట్టి సినిమాలు చేసారు గానీ ఇప్పుడెక్కడ కుదురుతుంది..? పైగా ఆయన డిప్యూటీ సీఎం కూడా.. ఇలాంటి టైంలో సినిమాలు ఊహించలేం అనుకున్న వాళ్లకు షూటింగ్‌కు వచ్చి సమాధానం ఇస్తున్నాడు.

2 / 5
తాజాగా తన సినిమా కెరీర్‌పై ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు పవర్ స్టార్. ఆయన డిప్యూటి సిఎం అయిన దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే.. సెట్స్‌పై ఉన్న సినిమాలు పూర్తి చేసినా అదృష్టమే.. ఆయనున్న బిజీకి సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి.

3 / 5
పవన్ కూడా తరుచుగా తనకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని.. కేవలం డబ్బుల కోసమే నటిస్తున్నానని చెప్తూ వచ్చాడు. దాంతో ఈయన రిటైర్మెంట్ ఖాయమే అనుకున్నారంతా. కానీ అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు పవర్ స్టార్. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు సినిమాలు చేస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు జనసేనాని. ఓ రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదని.. అది పెద్ద హెడేక్ అన్నారు పవన్.

4 / 5
దానికి డబ్బులు కూడా కావాలని.. తనకు వేరే వ్యాపారాలేం లేవని.. తనకు డబ్బులొచ్చేది కేవలం సినిమాల నుంచే కాబట్టి ఇకపై కూడా నటిస్తానంటూ కన్ఫర్మ్ చేసాడు పవన్. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి.. డబ్బు కావాలంటే సినిమాలు చేయాలి మరో ఆప్షన్ లేదంటున్నాడీయన. చెప్పినట్లుగానే వీరమల్లు పూర్తి చేసిన పవన్.. ఇప్పుడు ఓజి సెట్‌కు వచ్చేస్తున్నారు.

5 / 5
దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ కూడా 2 వారాల పాటు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. జూన్, జులై నెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్‌ను పూర్తి చేయాలనే చూస్తున్నాడు పవన్. ఈ లెక్కన తర్వాత కూడా పవన్ నుంచి సినిమాలు ఊహించొచ్చు. మొత్తానికి నో రిటైర్మెంట్ అంటున్నాడు పవర్ స్టార్.