
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన నటన, సహజమైన అందం, ఎలాంటి గ్లామర్ హంగులు లేకుండా కేవలం హావభావాలతోనే కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది ఈ నేచురల్ బ్యూటీ. తెరపై ఎంత హుషారుగా కనిపిస్తుందో, రియల్ లైఫ్‌లోనూ అంతే పద్ధతిగా, ఒద్దికగా ఉంటుంది. అయితే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య.. సాయిపల్లవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టడంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ షోలో ఎంతో మంది సెలబ్రెటీలు తమ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఇక ఇప్పుడు ఈ టాక్ షో సీజన్ 2 సైతం వచ్చేస్తుంది. జయంము నిశ్చయంము రా సీజన్ 2 కార్యక్రమం ఈ ఆదివారం రాత్రి 7:30 గంటలకు జీ సినిమాస్ లో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలో స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. జయమ్ము నిశ్చయంము రా సీజన్ 2 కార్యక్రమం ఈ ఆదివారం రాత్రి 7:30 గంటలకు జీ సినిమాస్ లో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక ప్రోమోలో చైతూ సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సాయి పల్లవి అమాయకంగా కనిపించినప్పటికీ, ఆమె స్వభావం గురించి ఒక రహస్యాన్ని బయటపెట్టారు.

షూటింగ్ ప్రారంభమైన రెండు మూడు రోజుల తర్వాత, సాయి పల్లవి అమాయకంగా తనను ఏదో అడిగిందని చై గుర్తు చేసుకున్నారు. అయితే, ఆమె ఎక్కువగా మాట్లాడదని ఎవరైనా చెబితే నమ్మవద్దని చై స్పష్టం చేశారు. "ఆమె చాలా మాట్లాడుతుంది" అని చై అన్నారు. అంతేకాకుండా, "ఒక అబ్బాయిలా చైతూ తనను ట్రీట్ చేస్తాడని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. "పెళ్లి అయింది. ఏంటి పెళ్లి అయిందా? అయ్యో." అంటూ జగపతి బాబు ఆట పట్టించారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. షూటింగ్ స్పాట్లో సాయిపల్లవి చేసే అల్లరి, ఆమె పనితీరు గురించి నాగచైతన్య పలు సందర్భాలలో ముచ్చటించారు. సెట్స్‌లో ఆమె ఎంత డెడికేటెడ్‌గా ఉంటుందో, అదే సమయంలో తోటి నటీనటులతో ఎలా సరదాగా ఉంటుందో నాగచైతన్య రివీల్ చేశారు. సాయిపల్లవి కేవలం నటి మాత్రమే కాకుండా మంచి డ్యాన్సర్ కావడంతో, రిహార్సల్స్ విషయంలో ఆమె చూపించే శ్రద్ధ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆయన తెలిపారు.