Megastar Chiranjeevi : కెరీర్ ప్రారంభంలో మద్యం తాగాలన్నారు.. పాండీ బజార్ జ్ఞాపకాలు పంచుకున్న చిరంజీవి..

Updated on: Nov 29, 2026 | 1:59 PM

హైదరాబాద్‌లో జరిగిన నశాముక్త భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి యువతకు, అభిమానులకు స్ఫూర్తి నింపే ప్రసంగం చేశారు. మాదకద్రవ్యాల మహమ్మారిపై పోరాటం చేస్తున్న కిషన్ రెడ్డి చొరవ, సంకల్పాన్ని కొనియాడిన చిరంజీవి, తన సినీ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ ముఖ్యమైన అనుభవాన్ని పంచుకున్నారు.

1 / 5
మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపనకు, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సాగుతున్న నషా ముక్త్ భారత్ యాత్రలో మెగాస్టార్ చిరంజీవి క్రియాశీలకంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వాకథాన్‌లో ఆయన యువత, విద్యార్థులతో కలిసి నడిచి, వారికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్, భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం, సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించాయి.

2 / 5
ఈ ముఖ్యమైన కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శ్రీ శ్రీ రవిశంకర్ గారికి ఈ మహత్తర కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చిరంజీవి తన ప్రసంగంలో, యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకూడదనే గొప్ప సంకల్పంతో జరుగుతున్న ఈ దేశవ్యాప్త ఉద్యమంలో భాగం కావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

3 / 5
"యువతే దేశానికి భవిష్యత్తు" అని ఆయన నొక్కి చెప్పారు. యువత ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటేనే దేశం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. యువశక్తి దేశ నిర్మాణానికి మూలమని, వారి శారీరక, మానసిక ఆరోగ్యం దేశ పురోగతికి అత్యవసరమని ఆయన వివరించారు. "డ్రగ్స్ అనేవి ఒక మాయ" అని, అవి మొదట స్నేహితుల ప్రోద్బలంతోనో లేదా కేవలం సరదాకో మొదలై, ఆ తర్వాత క్రమంగా బానిసత్వాన్ని తెస్తాయని అన్నారు.

4 / 5
తన సినీ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ ముఖ్యమైన అనుభవాన్ని పంచుకున్నారు. 48 ఏళ్ల క్రితం 22 ఏళ్ల వయసులో హీరో కావాలనే లక్ష్యంతో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన రోజులను చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఒకరోజు సాయంత్రం స్నేహితుడితో కలిసి సరదాగా టీ తాగడానికి పక్కనే ఉన్న పాండీ బజార్‌కు వెళ్లినప్పుడు అక్కడ కొత్త వాతావరణం, పరిచయస్తులు ఎదురయ్యారని తెలిపారు. ఆ సందర్భంలో కొందరు సరదాగా మందు, పార్టీలంటూ ప్రోత్సహించినా, తనకు అలాంటి అలవాట్లు లేవని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు.

5 / 5
ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఒక పెద్దాయన ఇచ్చిన మాటలు తన జీవితాన్ని మలుపుతిప్పాయని చిరంజీవి పేర్కొన్నారు. తొందరపాటు లేదా మొహమాటంతో ఒక్కసారి అలవాటు పడితే అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంటుందని, అనుకున్న లక్ష్యానికి అది గొడ్డలిపెట్టులా మారుతుందని ఆ పెద్దాయన హితవు పలికారన్నారు. కళ్లకు గంతలు కట్టిన గుర్రంలా లక్ష్యం వైపే దృష్టి పెట్టాలని ఆయన చెప్పిన మాటతో ఆ రోజు నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదని, కష్టపడి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నానని చిరంజీవి తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us