Cinema : ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Updated on: Apr 01, 2026 | 7:11 PM

నిజమైన సంఘటనలతో తెరకెక్కించిన సినిమాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో వచ్చిన చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓ మూవీ మాత్రం ఇండియలో జరిగిన నిజమైన ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఆ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది.

1 / 5
ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు వైరలవుతున్నాయి. ఆద్యంతం కట్టిపడేసే సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో సాగే చిత్రాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ట్రెండ్ అవుతుంది. అది పంజాబ్ లో జరిగిన దారుణమైన ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి IMDBలో 7.9 రేటింగ్ ఉంది.

2 / 5
మనం మాట్లాడుకుంటున్న ఆ సిరీస్ పేరు అన్ దేఖి. సమాజంలోని చీకటి కోణాలను అధికారం ఉన్నవాళ్లు సామాన్యులను ఎలా కష్టాలు పెడుతుంటారో ఇందులో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. హత్య చుట్టూ అల్లుకున్న కథనం మిమ్మల్ని ఆద్యంతం పిచ్చెక్కిస్తుంది. ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఈ చిత్రాన్ని 2016లో పంజాబ్ లో బటిండాలో జరిగిన దారుణమైన హత్య ఆధారంగా తెరకెక్కించారు.

3 / 5
అప్పట్లో పంజాబ్ లోని బటిండాలో పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని ఒక వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటనకు కొంత కల్పితం చేర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్.శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ను అస్సలు మిస్సవ్వకండి.

4 / 5
మొత్తం మూడు సీజన్లుగా రూపొందించిన ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సీజన్ నుంచి చివరి సీజన్ వరకు ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా.. హత్యల చుట్టూ సాగుతుంది. సీజన్ 1 పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్స్ అడవుల్లో మొదలవుతుంది. ఆ తర్వాత మనాలీలో అత్వాల్ కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసే ఇద్దరు అమ్మాయిలలో ఒకమ్మాయిని చూస్తుండగానే కాల్చి చంపేస్తాడు.

5 / 5
ఈ ఘటన మొత్తాన్ని అక్కడే పెళ్లి వేడుకను షూట్ చేస్తున్న ఇద్దరు కుర్రాళ్లు కెమెరాలో షూట్ చేస్తారు. అక్కడి నుంచి సీజన్ 1 ముగుస్తుంది. అలాగే సీజన్ 2 సైతం హత్యలు, దర్యాప్తు చుట్టూ సాగుతుంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. అత్వాల్ కుటుంబ సభ్యుల నేర చరిత్ర గురించి సాగుతుంది. ఇక సీజన్ 3 మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది.

Follow Us