
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఇండస్ట్రీలో ఆమె క్రేజీ బ్యూటీ. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు, సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమె అక్క మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆమె మరెవరో కాదు.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు. హీరోయిన్ అనుష్క శర్మ చెల్లెలు రుహానీ శర్మ. కానీ తన అక్క, బావ గురించి రుహానీ ఎప్పుడు బయటపెట్టలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ కు చెందిన ఈ అమ్మడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

2013లో తేగా బై ఏఅమ్మీ బాస్, క్లాస్ రూమ్ కుడి తు పటాకా వంటి పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో నటించింది. 2017లో తమిళంలో కడైసి బెంచ్ కార్తీ అనే సినిమా కథానాయికగా తెరంగేట్రం చేసింది. అదే ఏడాది చిలసౌ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. తర్వాత హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాలో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. నూటొక్క జిల్లా అందగాడు సినిమాలోనూ కనిపించింది. మెయిన్ హీరోయిన్ గా ఈ బ్యూటీకి క్రేజ్ రాలేదు.

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో నానా రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.