Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిందంటే..

Updated on: Feb 17, 2026 | 4:53 PM

హీరోయిన్ ప్రత్యూష.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. దాదాపు 24 ఏళ్లుగా తన బిడ్డకు న్యాయం కావాలంటూ ఆమె తల్లి పోరాడుతూనే ఉంది. చివరకు ఈ ఆమె కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. అసలు ప్రత్యూష ఎవరు.. ? అని ఈ తరం ప్రేక్షకులకు అస్సలు తెలియకపోవచ్చు. కానీ 90's యువతకు ఆమె ఆరాధ్య దేవత.

1 / 5
హీరోయిన్ ప్రత్యూష.. అచ్చ తెలుగమ్మాయి. నటనపై ఆసక్తితో ఇంటర్ పూర్తి కాగానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 1998లో రాయుడు చిత్రంలో మోహన్ బాబు కూతురిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత శ్రీరాములయ్య మూవీతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది.

2 / 5
ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కేవలం నాలుగు సంవత్సరాల్లో దాదాపు 12 చిత్రాలలో నిటంచి స్టార్ డమ్ సంపాదించుకుంది. సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని సినిమాలతో మెప్పించింది. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సూసైడ్ చేసుకుంది.

3 / 5
తన ఇంటర్ క్లా్స్ మేట్ సిద్ధార్థ్ రెడ్డితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది ప్రత్యూష. అయితే తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరు కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగారని.. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారని సమాచారం.

4 / 5
ఈ ఘటనలో ఫిబ్రవరి 24న ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. తనను ఆత్యాచారం చేసి చంపేశారని ఆమె తల్లి సరోజదేవి ఆరోపించారు. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు వైద్యుల బృందాన్ని నియమించింది.

5 / 5
ఈ కేసును పరిశీలించిన వైద్యుల బృందం ఆమెపై లైంగిక దాడి జరగలేదని తేల్చింది. ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించాడని అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు  సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలంటూ తీర్పూ ఇచ్చింది.

Follow Us