
జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశిత తో అతని వివాహం జరిగింది. ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్ గా ఓ గుడిలో ప్రవీణ్- వంశితల పెళ్లి జరిగిందని తెలుస్తోంది.

ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు ప్రవీణ్- వంశితల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రవీణ్- వంశిత.

ఇప్పటికీ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ప్రవీణ భార్య వంశిత తమ హల్దీ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. కొత్త జంట చూడముచ్చటగా ఉందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

ప్రవీణ్- వంశితలు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో కూడా పలు ఈవెంట్లలో కలసి కనిపించారీ లవ్ బర్డ్స్. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారని సమాచారం

కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పటాస్ తో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు.