
జబర్దస్త్, పటాస్ షోలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ ఇటీవల కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత నెలలోనే వీరి వివాహం సింపుల్ గా ఓ గుడిలో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ప్రవీణ్ వివాహ వేడుకకు హాజరయ్యారు.

జబర్దస్త్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ప్రవీణ్- కడెం వంశితల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలైన సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత ప్రవీణ్ మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లో సందడి చేస్తున్నాడీ కమెడియన్. అలాగే కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాడు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రవీణ్ తాజాగా తన భార్యతో కలిసున్న కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రవీణ్- వంశితలిద్దరూ బ్లూ కలర్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రవీణ్- వంశితలు పెళ్లికి ముందు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.. గతంలో కూడా పలు ఈవెంట్లలో కలిసి జోడీగా కనిపించారు. ఈ క్రమంలోనే పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. కాగా కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.