బిగ్ బాస్ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు.. సినిమా అవకాశాలు కూడా రాలేదు

Updated on: Nov 09, 2026 | 4:58 PM

సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు.. వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు.. ప్రేమలో ఎదురైన చేదు అనుభవాలు.. బిగ్ బాస్ తర్వాత కెరీర్‌లో వచ్చిన మార్పులు.. ఇలా నటి ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

1 / 5
సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు.. వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు.. ప్రేమలో ఎదురైన చేదు అనుభవాలు.. బిగ్ బాస్ తర్వాత కెరీర్‌లో వచ్చిన మార్పులు.. ఇలా నటి ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం తాను పడిన కష్టాలను వివరిస్తూనే, తన బ్రేకప్‌కు గల కారణాలను కూడా బయటపెట్టారు. అంతేకాదు, బిగ్ బాస్ షో తర్వాత తన పారితోషికం తగ్గిపోయిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఇనయా సుల్తానా ఏయే విషయాలను పంచుకున్నారంటే..

2 / 5
 సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించడం అంత సులభం కాదని ఇనయా సుల్తానా తెలిపారు. అవకాశాల కోసం పలువురిని స్వయంగా కలవాల్సి వచ్చిందని, కొన్నిసార్లు చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డానని గుర్తుచేసుకున్నారు. ఇండస్ట్రీలో మనుషులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం తనకు ఉందని, మీడియా కూడా తనకు ఎంతో కొంత అండగా నిలిచిందని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ గత ప్రేమ వ్యవహారంపై ఇనయా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వస్తున్న పేరు, ఫేమ్, సినిమా అవకాశాలను మాజీ ప్రియుడు తట్టుకోలేకపోయేవాడని తెలిపారు. అతడి అసూయే తమ బ్రేకప్‌కు ప్రధాన కారణమని వెల్లడించారు. ఒక వివాహ వేడుకలో అందరి ముందు తనను దుర్భాషలాడటంతో అప్పుడే ఆ సంబంధానికి ముగింపు పలికినట్లు చెప్పారు.

3 / 5
సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోవడం తనకు ఇష్టం లేదని ఇనయా తెలిపారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టడం వల్ల దిష్టి తగులుతుందని తాను బలంగా నమ్ముతానని చెప్పారు. అందుకే ఈ మధ్య ఫొటోషూట్స్ కూడా తగ్గించానని, తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో గతంలో మాదిరిగా ఫొటోషూట్ చిత్రాలు కనిపించవని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా ప్రాజెక్టుల గురించి కూడా బయటకు చెప్పడం లేదని ఇనయా వెల్లడించారు. ప్రాజెక్టుల వివరాలు ముందుగానే పంచుకుంటే దిష్టి తగులుతుందనే భయం ఉందని, అందుకే సినిమాల విషయాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. సరైన సమయంలోనే తన తదుపరి ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తాననే సంకేతాలిచ్చారు.

4 / 5
 సినిమా రంగంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఇనయా అభిప్రాయపడ్డారు. అందుకే కెరీర్‌కు మరో ప్రత్యామ్నాయంగా రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దుబాయ్‌కు వెళ్లినప్పుడు స్నేహితుడి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెలుసుకున్నానని వెల్లడించారు. ఇప్పటివరకు దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, సింగపూర్, మలేషియా వంటి ప్రాంతాలకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. అమెరికా, యూకే వంటి దేశాలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. తన స్నేహాలు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని ఇనయా చెప్పారు. తన బాధలను ఇతరులతో పంచుకోవడం అంతగా నచ్చదని, ఎవరికైనా చెప్పుకుంటే తనలోనే ఏదో లోపం ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు. సంతోషంగా ఉన్నప్పుడు అందరితో కలిసిపోతానని, బాధలో ఉన్నప్పుడు మాత్రం ఒంటరిగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని వివరించారు.

5 / 5
 బిగ్ బాస్ షో తన కెరీర్‌ను పెద్దగా మార్చలేదని ఇనయా సుల్తానా చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ షో తర్వాత తనకు సినిమా అవకాశాలు పెరుగుతాయని భావించినా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. పైగా సినిమాల్లో తన రెమ్యునరేషన్ కూడా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది కానీ సినిమా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావని అభిప్రాయపడ్డారు. చాలామందికి ఈ షో తర్వాత నెగెటివిటీ ఎదురవుతుందని, తనకు మాత్రం దేవుడి దయతో పాజిటివిటీ లభించిందని చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us