
నటికీ అందం ప్లస్ అవుతుంది.. అభినయం ఉంటె ఇంకా సూపర్.! ఈ రెండు ఉన్న లేకున్నా ఇంపార్టెంట్ గా ఉండాల్సిన లక్షణం ఒకటి ఉంది. అది లక్షణమా.? స్వభావమా.? అంటే నా వరకు స్వభావమే అంటుంది కన్నడ బ్యూటీ నభా నటేష్.

ఇస్మార్ట్ శంకర్ తో అబ్బబ్బ అనిపించుకున్న ఈ బ్యూటీ కాన్ఫిడెంట్ గా చెప్పిన విషయాలు ఏంటి అంటే..? ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్ మూవీతో పాపులారిటీ తెచ్చుకుంది.

నభా ఫస్ట్ మూవీ 2018 లో నన్ను దోచుకుందువటే రిలీజ్ అయ్యింది. 2019 లో ఇస్మార్ట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ కెరియర్ లో బ్యాక్ స్టెప్ వెయ్యదు అనుకున్నారు అందరూ.

ఆతరువాత వరస సినిమాలు సైన్ చేసిన అంత సక్సెస్ అవ్వలేకపోయింది. అయితే అప్పుడు నభా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సినిమా అవకాశాలు రావాలి ఫలితలు తారుమారు అయినా నేను పట్టించుకోను.. ఫోకస్డ్ గా కాస్త పడితే దక్కే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అని నాకు తెలుసు.!

ఆత్మస్తైర్యం తో ఉండటమే నా బలం అని కాన్ఫిడెంట్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియా కే పరిమితం అయ్యింది.

అంటే ఇప్పటికి ఆమె అవకాశాలకోసం ఆమె ఆత్మస్తైర్యంతో ఉందని చెప్పినట్టే అంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ లు పెడుతూ ఆమె అభిమానులను పలకరిస్తూ ఉంటుంది నభా నటేష్.