
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ ప్రముఖ నటి. పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లోనూ నటించింది. అయితే కొన్నేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఒక సూపర్ హిట్ సినిమాతో ఈ సీనియర్ నటి పేరు తెగ మార్మోగిపోయింది.

ఈ నటి మరెవరో కాదు 'వకీల్ సాబ్' సినిమాలో నటించిన లిరిషా రెడ్డి అలియాస్ సూపర్ ఉమెన్. ఈ నటి అసలు పేరు సరళాదేవి అలియాస్ లిరీషా రెడ్డి. సినిమాలు, సీరియల్స్ తో బిజీగా ఉండే ఈ నటి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలతో పాటు తన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె చెట్టు కింద కూర్చుని పుస్తకం పట్టుకున్న ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఓ ఫొటో షూట్ లో భాగంగానే లిరిషా ఇలా కెమెరాకు డిఫరెంట్ పోజులిచ్చిందని తెలుస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పుడేం చదువుతున్నారు మేడమ్', మేడమ్ సార్ మేడమ్ అంతే' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మెగా స్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది లిరిషా రెడ్డి. అందులో కమెడియన్ సునీల్ ని పెళ్లి చేసుకునే అమ్మాయిగా ఓ చిన్న పాత్ర పోషించిందామె. ఆ తర్వాత పలు మూవీస్, సీరియల్స్ చేసింది.

అయితే వకీల్ సాబ్ లో చిత్రంలో లేడీ ఎస్ఐ పాత్రలో అదరగొట్టింది లిరిషా. అందులో పవన్ కల్యాణ్ ఆమెను సూపర్ ఉమెన్ అని పిలవడంతో ఈ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేతిలో సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.