
సారా అలీ ఖాన్ - ఈ రోజుల్లో లేస్ డ్రెస్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో, సారా అలీ ఖాన్ వైట్ క్రోచెట్ మినీ డ్రెస్ ధరించి ఉంది. దీని నెక్ లైన్ చతురస్రాకారంలో ఉంది. పఫ్ స్లీవ్‌లతో ఉన్న ఈ డ్రెస్‌లో సారా అలీ ఖాన్ చాలా అందంగా ఉంది.

ప్రియాంక చోప్రా - ఆఫ్-వైట్ మినీ డ్రెస్‌లో దేవ కన్యలా మెరిసిపోతుంది. మోచేతుల వరకూ స్లీవ్స్ ఉన్న ఈ మినీ డ్రెస్ వేసవిలో ఖచ్చితంగా మంచి ఎంపిక. ప్రియాంక బ్లాక్ లెదర్ హీల్స్‌తో మరింత అందంగా కనిపిస్తుంది

అనన్య పాండే - బాలీవుడ్ నటి అనన్య పాండే తెల్లటి శాటిన్ మినీ డ్రెస్ ధరించింది. ఈ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో అనన్య చాలా అందంగా ఉంది. మీరు పార్టీ కోసం అలాంటి దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. అనన్య పాండే తన జుట్టును ప్రీగా వదిలేసింది. తక్కువ మేకప్‌తో సహజంగా కనిపిస్తుంది.

అలియా భట్ - బాలీవుడ్ నటి అలియా భట్ గంగూబాయి కతియావాడి సినిమా వార్తలతో చాలా రోజుల నుంచి హల్ చల్ చేస్తుంది. ఈ చిత్రంలో అలియా తెల్లటి మినీ డ్రెస్‌లో ఉంది. అలియాకు ఈ డ్రెస్ బ్లేజర్ లుక్‌ని ఇస్తుంది. లాంబ్ లెదర్ డ్రెస్‌లో చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఆఫీసులోని పార్టీ కోసం ఈ రకమైన దుస్తులు మంచి ఎంపిక.

శ్రద్ధా కపూర్ - శ్రద్ధా కపూర్ తెల్లటి దుస్తులు ధరించింది. ఇది బటన్ డౌన్ డ్రెస్.. విక్టోరియన్ స్టైల్ హై నెక్ కాలర్ తొ పాటు బిషప్ స్లీవ్‌లు ఉన్నాయి. లుక్‌ని మరింత గ్రేస్ తెచ్చేలా శ్రద్ధా నలుపు స్ట్రాపీ చెప్పులు ధరించింది. ఈ లుక్‌లో శ్రద్ధా చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.