
అందాల చిన్నది ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది. తాజాగా పింక్ డ్రెస్‌లో దిగిన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా తన అంద చందాల మంది ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతక ముందు అనే సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది.

ఇక ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మెరవగా, చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది. తన నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది.

ముఖ్యంగా తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని చెప్పాలి. దీంతో తమిళ, మలయాళం వైపు వెళ్లి అక్కడే వరసగా సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ తెలుగులో ఓం శాంతి శాంతి శాంతి: మూవీలో నటించి, మరోసారి తెరపై సందడి చేసింది.

ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో బిజీగా ఉంటూనే, ఓ వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నిది పింక్ డ్రెస్‌లో తన క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.