
Actrసినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అందాల తారలుగా, అభినయ సితారాలుగా ఇండస్ట్రీని ఏలారు. కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి ఆతర్వాత కనిపించకుండా మాయం అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. అందంలో అప్సరస, నటనపరంగానూ అభిమానులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ ముద్దుగుమ్మ చేసింది కొన్ని సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ. అంతే కాదు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ అందుకుంది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించలేకపోయింది. అందం అభినయంతో ఆకట్టుకోవడంతో పాటు హిట్స్ అందుకున్నా కూడా ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. దాంతో ఆమె సినిమాల నుంచి కనుమరుగయ్యింది.

ఒకప్పుడు తన అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో అంజలా జవేరి ఒకరు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా అంజలిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది విక్టరీ వెంకటేష్. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా.. సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అంజలా. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటిలో ఈ అమ్మడు యూత్ ఆరాధ్య దేవత.

తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలా. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా.. దేవి పుత్రుడు, నాగార్జునతో చందమామ రావే, చిరంజీవితో చూడాలని ఉంది, బాలకృష్ణతో నరసింహనాయుడు.. భలేవాడివి బాసులాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది.

కాగా అంజలా జవేరి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత తిరిగి తెలుగులో ప్రేమ సందడి, ఆప్తుడు సినిమాలు చేసింది. ఆలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. వీటితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోను మెరిసింది. మెగాస్టార్ తో చూడాలని ఉంది మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే బాలయ్య బాబుతో నరసింహనాయుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.