
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లు అదిరే మేకోవర్‌తో అవాక్ అయ్యేలా చేస్తున్నారు. ఏకంగా హీరో.. హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఇలా స్టార్స్ గా మారారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. కావ్య కల్యాణ్ రామ్ కూడా హీరోయిన్‌గా దూసుకుపోతుంది.

ఇలా ఇంకొంతమంది ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో చిన్నది కూడా చేరిపోయింది. పై ఫొటోలో సూర్య, జ్యోతికతో ఉన్న ఈ చిన్నారి గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మెటలెక్కుద్ది.. సూర్య హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వు నేను ప్రేమ సినిమా ఒకటి. ఈ సినిమాలో సూర్యకు జోడీగా జ్యోతిక నటించింది. అలాగే ఈ సినిమాలో భూమిక కూడా నటించారు. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నది గుర్తుందా.?

ఇప్పుడు అందంలో స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేస్తుంది. ఇంతకూ ఆ చిన్నారి ఎవరో తెలుసా.? ఆమె పేరు శ్రియ శర్మ. తెలుగు, తమిళ్ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది ఆ చిన్నారి. ఇదిలా ఉంటే ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఆ మధ్య శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించింది. అలాగే గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకాదు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు నెటిజన్స్. దాంతో ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో .. చూస్తే అవాక్ అవ్వాల్సిందే. హీరోయిన్స్ ను మించిన అందంతో వయ్యారంతో ఆకట్టుకుంటుంది శ్రియ శర్మ.

హిమాచల్ ప్రదేశ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని తండ్రి ఇంజనీర్ కాగా.. ఆమె తల్లి డైటీషియన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. సినిమాల కంటే ఆమె లాయర్ వృత్తిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.