RC16లో హీరోయిన్.. విచిత్రమైన కండీషన్ పెట్టిన దర్శక నిర్మాతలు..

| Edited By: Phani CH

Nov 22, 2023 | 8:29 PM

రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి..? పైగా అతనిప్పుడు గ్లోబల్ స్టార్ కూడానూ. ఇలాంటి టైమ్‌లో చరణ్‌తో జోడీ కడితే దెబ్బకు ఇండియా మొత్తం తెలిసిపోతాం.. అదృష్టం బాగుంటే ప్రపంచంలో కూడా పాపులర్ అవుతాం అని కలలు కంటుంటారు హీరోయిన్లు. అందుకే చరణ్ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యడు రామ్ చరణ్.

1 / 6
రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి..? పైగా అతనిప్పుడు గ్లోబల్ స్టార్ కూడానూ. ఇలాంటి టైమ్‌లో చరణ్‌తో జోడీ కడితే దెబ్బకు ఇండియా మొత్తం తెలిసిపోతాం.. అదృష్టం బాగుంటే ప్రపంచంలో కూడా పాపులర్ అవుతాం అని కలలు కంటుంటారు హీరోయిన్లు. అందుకే చరణ్ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్నాడు.

2 / 6
 దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యడు రామ్ చరణ్. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలని ముందుగా ప్లాన్ చేసుకున్నా.. ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు.. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ ఊహించిన దానికంటే లేట్ అవుతూనే ఉంది. అందుకే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాపై కూడా పడుతుంది.

3 / 6
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాడు బుచ్చిబాబు. కానీ ఏం చేస్తాం.. గేమ్ ఛేంజర్ వల్ల ఈ సినిమా కూడా ఆలస్యం అవుతుంది. ఆర్నెళ్లుగా చరణ్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు బుచ్చిబాబు. పరిస్థితులు చూస్తుంటే ఈ వెయిటింగ్ మరో ఆర్నెళ్లైనా ఉండేలా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు సినిమాను మొదలుపెట్టిన మరో ఆర్నెళ్ల వరకు షూటింగ్ పూర్తి చేయడం కష్టమే.. ఇంకా గేమ్ ఛేంజర్ షూటింగ్ అంత బ్యాలెన్స్ ఉంది. అందుకే చరణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.

4 / 6
అయితే బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ముందుగా ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు.. చరణ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావాలంటే ఓ కండీషన్‌కు ఓకే చెప్పాలి.

5 / 6
ఆ సినిమా చేస్తున్న సమయంలో ఇతర సినిమాలు చేయకూడదు.. ఒక్కముక్కలో చెప్పాలంటే చరణ్ సినిమా అయ్యేంత వరకు బల్క్ డేట్స్ కావాలి.. ఎప్పుడు షూటింగ్‌కు రమ్మంటే అప్పుడు రావాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత.. ఆరేడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు బుచ్చిబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ 2024 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి.. సమ్మర్ 2025కి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు.

6 / 6
దానికోసం చరణ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. శంకర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పూర్తిగా డేట్స్ అన్నీ బుచ్చిబాబుకే ఇవ్వాలని చూస్తున్నాడు. ఒకవేళ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు వర్కవుట్ అయితే.. కచ్చితంగా ఆర్నెళ్ల గ్యాప్‌లోనే చరణ్ రెండు సినిమాలతో రావడం ఖాయం. అందుకే బల్క్ డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసమే చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలిక.