
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అంద చందాలతో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టింది.

ముఖ్యంగా ఈ అమ్మడు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యిందనే చెప్పాలి. షోలో ఈ అమ్మడు తన ఆటతీరు, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. హౌస్‌లో ఉన్నది కొన్ని రోజులే అయినా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక, ఈ అమ్ముడుకు చాలా అవకాశాలే వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటించింది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో కూడా కీలకపాత్రలో నటించి, తన నటతో ఆకట్టుకుంది.

ఇవే కాకుండా, పలు వెబ్ సిరీస్‌లలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఇక ఈ మధ్య ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.