Bhairavam: భైరవం ట్రైలర్ అలరించిందా.? ప్రేక్షకులు రెస్పాన్స్ ఏంటి.?

Edited By:

Updated on: May 22, 2025 | 3:37 PM

తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత క్రేజీ మల్టీస్టారర్ భైరవం. ఫామ్‌లో లేని హీరోలే నటిస్తున్నారు గానీ.. ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ అయిన సినిమాకు రీమేక్ ఇది. పైగా టీజర్ కూడా అదిరిపోయింది. తాజాగా ట్రైలర్ వచ్చింది. మరి భైరవం ట్రైలర్ ఎలా ఉంది..? జూన్ 1 నుంచి జరగబోయే థియేటర్స్ బంద్ ఎఫెక్ట్ భైరవం సినిమాపై పడబోతుందా..?

1 / 5
అసలే క్రేజీ సినిమాల్లేక థియేటర్స్ కళ తప్పుతున్నాయి. ఆ మధ్య వచ్చిన హిట్ 3, సింగిల్ సినిమాలతోనే ఇప్పటికీ థియేటర్స్ రన్ అవుతున్నాయి. గత వారం యమదొంగ, ఈ వారం వర్షం అంటూ మళ్లీ పాత సినిమాలనే రీ రిలీజ్ చేస్తున్నారు.

2 / 5
Bhairavam: భైరవం ట్రైలర్ అలరించిందా.? ప్రేక్షకులు రెస్పాన్స్ ఏంటి.?

3 / 5
తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన గరుడన్ సినిమాకు రీమేక్ ఇది. ఒరిజినల్ ఛాయలు కనిపిస్తున్నా.. తెలుగు ఆడియన్స్ కోసం మార్పులు భారీగానే చేసినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.. చివరి షాట్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉంది.

4 / 5
ఓ గుడి, వాటి ఆస్తుల చుట్టూ తిరిగే గ్రామీణ కథ ఇది. మంచు మనోజ్‌కు రీ ఎంట్రీ సినిమా ఇది.. అలాగే బెల్లంకొండ, రోహిత్ సైతం చాలా రోజులుగా సక్సెస్‌లలో లేరు.. దర్శకుడు విజయ్ కూడా ఉగ్రంతో కమర్షియల్ విజయం అందుకోలేదు.

5 / 5
అందుకే అందరికీ భైరవం కీలకమే. మరోవైపు జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలనుకున్న నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు కాస్త వాయిదా వేశారు.. ఇక్కడ చూస్తేనేమో మే 30న వస్తుంది భైరవం. ఇది ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. మరి ఏం జరగబోతుందో చూడాలిక. 