
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇటీవలే ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కో ఓనర్, ప్రముఖ వ్యాపార వేత్త కావ్య మారన్ తో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. నవంబర్ 11న గ్రీస్ వేదికగా జరిగి నీ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భారీగా హాజరయ్యారు.

స్లో బీచ్ వెడ్డింగ్‌లు ఎలాగైతే ఘనంగా జరుపుకొంటారో, అదే విధంగా అనిరుధ్, కావ్య మారన్ల వివాహం కూడా చాలా వైభవంగా జరిగింది. కాగా వివాహ వేడుక అనంతరం స్వయంగా అనిరుధ్ పెళ్లి ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీంతో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలిపారు.

తాజాగా తన పెళ్లి వేడుకకు సంబంధించి మరిన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు అనిరుధ్. ఈ ఫొటోల్లో కావ్య- అనిరుధ్ కలర్ ఫుల్ డ్రెస్సుల్లో ఎంతో అందంగా కనిపించారు. వీరితో పాటు కలానిధి మారన్ , అనిరుధ్ కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు. అలాగే రజనీకాంత్, లతా రజనీకాంత్, ఎం.కె. స్టాలిన్, దుర్గా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ ఈ పెళ్లిలో సందడి చేశారు.

ప్రస్తుతం అనిరుధ్ షేర్ చేసిన పెళ్లి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత తర్వాత శనివారం ( నవంబర్ 2)1న చెన్నైలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.

అనిరుధ్- కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ కు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇందు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలిసి ఆహ్వానించారు అనిరుధ్- కావ్య పేరెంట్స్.

అనిరుధ్- కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా పలువరు సినీ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే అతిథుల కోసం రకరకాల రుచికరమైన వంటకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.