
బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇప్పుడు సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ యాంకరమ్మగా సందడి చేస్తుంది. ఇటీవలే ఓ మూవీలో కీలకపాత్రలో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఆమె మరెవరో కాదండి యాంకర్ స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేసింది. తన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంది. విజేతగా గెలవకపోయినప్పటికీ తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట యాక్టివ్ అయ్యింది.

అలాగే ఇప్పుడు టీవీ షోస్, సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం యాంకర్ గా అలరిస్తున్నఈ అమ్మడు.. ఇప్పుడు నటిగా మారింది. ఇటీవలే హే బలవంత్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. ఇందులో సుహాస్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

ఈ సినిమాతో అటు నటిగా ప్రశంసలు అందుకుంది స్రవంతి. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో సందడి చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి స్రవంతి హీరోయిన్లకు తక్కువ కాదంటున్నారు నెటిజన్స్.

స్రవంతి చొక్కారపు ఇప్పుడు బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చలాకీగా ఉంటూనే తన మాట తీరుతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మరోవైపు నెట్టింట క్రేజీ పోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.