Village Backdrop: పొలిమేర దాటని కథలు.. గ్రామీణ నేపథ్యంపై ఫోకస్ పెట్టిన హీరోలు..

|

Nov 20, 2024 | 10:12 AM

పొలిమేర దాటని కథలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇదే ట్రెండ్ ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్లు కంటిన్యూ అవుతుందో చెప్పలేం. అందుకే వేడి మీదున్నపుడే ఇలాంటి కథలు రాసుకోవాలని ఫిక్సైపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు మాత్రమే కాదు.. రాబోయే సినిమాల్లోనూ చాలా వరకు గ్రామీణ నేపథ్యమే ఎక్కువగా కనిపిస్తుంది.

1 / 5
మన తెలుగు హీరోలు కూడా పూర్తిగా రూటెడ్ కథల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరి ఫోకస్ ఇప్పుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలపైనే ఉంది. మరి మరి రానున్న పల్లె  నేపధ్య సినిమాలు ఏంతో చూద్దాం రండి.. 

2 / 5
నాని కెరీర్‌ను మార్చేసిన సినిమాల్లో పిల్ల జమీందార్ ఒకటి. ఆ సినిమా కథ అంతా ఒకే ఊరిలోనే జరుగుతుంది. అలాగే గతేడాది దసరాలోనూ కథ మొత్తం చిన్న ఊళ్లో జరుగుతుంది. పక్కా రూటెడ్ కథ ఇది. తెలంగాణ నేపథ్యం బాగా కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. మొన్నొచ్చిన సరిపోదా శనివారం కథ కూడా సోకులపాలెం అనే ఊరి గురించే..!

3 / 5
చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభరలో గ్రామీణ నేపథ్యం ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది. సోసియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

4 / 5
అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పూర్తిగా ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కబోతుంది. ఉప్పెన మాదిరే ఈ సినిమాను రూటెడ్‌గా రూపొందిస్తున్నారు బుచ్చిబాబు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయకిగా నటిస్తుంది. 

5 / 5
అలాగే నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా ఫ్రాంచైజీలో మరో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి చుడాలిక ఇందులో మూడో సినిమా వస్తుందేమో.. 