
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. గంగుబాయి కతియవాడి వంటి సినిమాతో జాతీయ అవార్డ్ అందుకుంది. గ్లామరస్ కథానాయికగా.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించింది. ఇదివరకే తెలుగులో ఓ సినిమాలో కనిపించి దక్షిణాది సినీ ప్రియుల హృదయాలు గెలుచుకుంది అలియా.

తాజాగా ఈ అమ్మడు మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుందని టాక్. రాబోయే పాన్ ఇండియా తెలుగు చిత్రంలో ఓ కీలకపాత్రలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుందని టాక్. ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం అలియా పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. ఇది ఖరారైతే మరోసారి తెలుగు సినీప్రియులను ఈ అమ్మడు అలరించడం ఖాయమని తెలుస్తోంది.

ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా విపరతీమైన బజ్ నెలకొంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ చిత్రంలో ఇప్పుడు అలియా సైతం భాగమవుతుందనే టాక్ వినిపించడంతో ఆ ప్రాజెక్ట్ పై మరింత హైప్ ఏర్పడింది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటీ.? అనే విషయాలు తెలుసుకుందామా.

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ చిత్రం డ్రాగన్ (ప్రచారంలో ఉన్న పేరు). కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ లుక్ పూర్తిగా మార్చేశారు. కండలు తిరిగిన దేహంతో ఇటీవల షేర్ చేసిన ఫోటోతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో అలియా భట్ కనిపించనున్నారట. ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేశారని.. అందులో కథానాయికగా రోల్ కోసం అలియా పేరు పరిశీలిస్తున్నారని టాక్. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో కనిపించింది అలియా.