మహేశ్ భట్ వారసురాలిగా అడుగుపెట్టినా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియాభట్ (Alia Bhatt). వరుస విజయాలు సొంతం చేసుకుంటూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. త్వరలో 'ఆర్‌ఆర్‌ఆర్'తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనున్న ఈ ముద్దుగుమ్మ ఇక్కడ కూడా పాగే వేసేందుకు సిద్ధమవుతోంది.