Cinema OTT: బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. ట్రెండింగ్‏లో నెంబర్ వన్..

Updated on: Sep 07, 2026 | 9:30 PM

యాక్షన్, భావోద్వేగ సంఘర్షణలు, తన కూతురి కోసం పోరాడే తల్లి కథతో ఈ చిత్రం ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ మూవీని డిజిటల్ ప్లాట్ ఫామ్ పై దుమ్మురేపుతుంది. ఆద్యంతం ఈ మూవీ అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ సినిమా గురించి తెలుసుకుందామా.

1 / 5
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతుంది. తాప్సీ నటించిన యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ 'గాంధారి', 2026 సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. 'గాంధారి' కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ సినిమాలోని సీన్స్, ట్విస్టులు ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి.

2 / 5
ఈ చిత్రంలో తాప్సీ పన్ను బాని అనే తల్లి పాత్రను పోషించింది. తన కూతురు అపహరణకు గురైన తర్వాత, ఆమెను కనుగొనడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ప్రమాదకరమైన అడ్డంకులను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ, తన కూతురిని తిరిగి పొందాలనే ఆమె దృఢ సంకల్పం, ప్రతి అడ్డంకిని అధిగమించే శక్తిని ఆమెకు ఇస్తుంది. ఈ సినిమా కథ కేవలం యాక్షన్ ప్రధానంగానే కాకుండా, ఒక తల్లి పడే భావోద్వేగ సంఘర్షణపై కూడా దృష్టి పెడుతుంది.

3 / 5
తన బిడ్డ భద్రత పట్ల తల్లికి ఉండే భయం, ఆ బిడ్డ కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉండటమే ఈ చిత్రంలో భావోద్వేగ పరంగా ప్రధానాంశం. 'గాంధారి' చిత్రంలో తాప్సీ పన్ను మరోసారి యాక్షన్ పాత్రలో కనిపించనుంది. బాని పాత్ర శారీరకంగా చాలా సవాలుతో కూడుకున్నదని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. 'గాంధారి' చిత్రానికి కనికా ధిల్లాన్ రచన, నిర్మాణం చేయగా, దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. ఇది తాప్సీ, కనికల పునఃకలయిక.

4 / 5
గతంలో వీరిద్దరూ 'హసీన్ దిల్‌రూబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా' వంటి ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు. ఈ చిత్రంలో తాప్సీతో పాటు ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ, మీతా వశిష్ట్ , జతిన్ సర్నా కూడా నటించారు. ముఖ్యంగా, మరాఠీ నటి ఛాయా కదమ్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె నటనతో పాటు, ఆ పాత్ర కోసం ఆమె చేసిన భాషా సన్నాహాలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

5 / 5
తాప్సీ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు బాగున్నప్పటికీ... కథనంలో బలమైన ఎమోషన్స్, లాజిక్ లోపించడం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. కంటిచూపు కోల్పోయిన తల్లిగా, కూతురి కోసం తెగించి పోరాడే పాత్రలో తాప్సీ అత్యద్భుతంగా నటించింది. సినిమాలో తాప్సీ చేసిన స్టంట్, ఫైట్ సీక్వెన్సెస్ చాలా నేచురల్‌గా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. తాప్సీ పన్ను వన్-మెన్ షో , యాక్షన్ సీన్ల కోసం ఒకసారి చూడదగ్గ సినిమా.

Loading...
Unable to load recommendations.
Follow Us