Sneha : అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్ స్నేహ..

Updated on: Mar 02, 2026 | 6:52 PM

ఒకప్పుడు దక్షిణాది సినీరంగంలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ స్నేహ. తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామర్ షోకు దూరంగా పద్దతిగా కనిపిస్తూనే ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడు.

1 / 5
హీరోయిన్ స్నేహ.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే పద్దతిగా కనిపిస్తూ ఫ్యామిలీ అడియన్స్ హృదయాలు దొచుకుంది.

2 / 5
స్నేహ.. షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఓ మలయాళీ ప్రొడ్యూసర్ స్నేహను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. అందుకు తన తల్లిదండ్రులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 2000లో ఇంగానే ఓరు నీలపక్షి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఆ తర్వాత తరుణ్ హీరోగా వచ్చిన ప్రియమైన నీకు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన స్నేహ.. ఆ తర్వాత ఏవండోయ్ శ్రీవారు, మహారథి, మధుమాసం, నీ సుఖమే నే కోరుకున్న, సంక్రాంతి, శ్రీరామదాసు వంటి చిత్రాల్లో నటించారు.

4 / 5
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తమిళ హీరో ప్రసన్నతో ప్రేమలో పడిన స్నేహ.. 2012లో రెండు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది.

5 / 5
 ఇప్పుడు మరోసారి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నటిగా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తనకు చిన్న ప్రమాదం జరిగిందని.. దీంతో కనీసం 8 నెలలు విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తాను బిజినెస్ రంగంలో దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.

Follow Us