
అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతో తన అందంతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది.

తక్కువ సమయంలో రాశి ఖన్నాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సక్సెస్ లు మాత్రం అంతగా రాలేదు అనే చెప్పాల్సి. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు హీరోయిన్ గా నటించింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు హిందీలోనూ అవకాశాలు అందుకుంది.

ఆ మధ్య బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. తెలుగులో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

అలాగే తమిళ్ లోనూ అడపాదడపా సినిమాలు చేస్తుంది. తెలుగులో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది. అలాగే సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేసే ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.