
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడును గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గ్లామర్ సెన్సేషన్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.

అలాగే అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా చేతిలో గులాబీలతో ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? తనే హీరోయిన్ నేహా శెట్టి.

మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా.. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం డీజే టిల్లు.

సిద్ధు జొన్నలగడ్డతో చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఈ మూవీతోనే తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో లుక్స్ తోపాటు గ్లామర్ బ్యూటీగానూ కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అంతా భావించారు.

కానీ అలా జరగలేదు. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం చూస్తున్న నేహా.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. కానీ థియేటర్లలో మాత్రం ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ తొలగించి చివరకు యూట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్రయూనిట్.