
. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడడం చాలా తక్కువ. అరుదైన సందర్భా్ల్లో మాత్రమే తమ భావాలను షేర్ చేసుకుంటారు.

తమమొదటి పరిచయం, ప్రేమ, పెళ్లి, ఆతర్వాతి జీవితం గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తమ ఇద్దరి మధ్య ప్రేమకు ఎలా పునాది పడిందో పలుసార్లు ఓపెన్ అయ్యారు.

విరాట్- అనుష్క 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. 2013లో ఓ అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్‌లో వీరిద్దరు మొదటి సారిగా కలిశారు. అప్పుడే ఇద్దరి అభిరుచులు, మనసులు కలిశాయి.

టాప్-ఆఫ్-ది-లైన్ షాంపూ ప్రకటనలో మొదటిసారిగా కలిసి నటించారు విరాట్- అనుష్క. విరాట్ కోహ్లీ జ్ఞాపకశక్తి చాలా అద్భుతమని, ఆ విషయంలోనే కోహ్లీ తెగ నచ్చేశాడని అనుష్క చెప్పుకొచ్చింది.

విరాట్, అనుష్క 2017లో పెళ్లి చేసుకున్నారు. వారి దాంపత్య బంధానికి గుర్తుగా వారి జీవితాల్లోకి వామిక అడుగుపెట్టింది. క్రికెట్, సినిమా ప్రపంచంలో విరాట్- అనుష్కలను ఆదర్శ జోడీగా పేర్కొంటారు.