Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

Updated on: Apr 18, 2026 | 10:37 AM

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి ఆమె. తెలుగులో ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. కేరళ సంప్రదాయ పండుగ 'విషు' (Vishu) సందర్భంగా తన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. కేరళీయులకు 'విషు' అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక కొత్త ఆరంభం, భావోద్వేగాలతో కూడిన వేడుక.

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు గుర్తుందా.. ? ఇటీవల తెలుగులో ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. చేసిందే ఒక్క మూవీ.. కానీ ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఆమె అందమైన కళ్లు.. ఆకట్టుకునే రూపం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఇటీవల తమ విషు పండగ గురించి ఆసక్తకిర కామెంట్స్ చేసింది అనస్వర.

2 / 5
తన దృష్టిలో 'విషు' అంటే వంటగది నుండి వచ్చే ఉన్నియప్పం (బియ్యం పిండి, బెల్లంతో చేసే కేరళ స్వీట్) సువాసన, ఇంటి నిండా వెలిగే దీపాల వెలుగులు అని పేర్కొన్నారు. చిన్నప్పుడు పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేవగానే అమ్మ వంట చేస్తుంటే వచ్చే ఆ తీపి సువాసన తన పండుగ జ్ఞాపకాల్లో చెరగని ముద్ర వేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

3 / 5
విషు పండుగలో అత్యంత కీలకమైన 'విషు కని' (Vishu Kani) గురించి ఆమె వివరిస్తూ.. ఉదయాన్నే కళ్ళు మూసుకుని వచ్చి దేవుడి ముందు అమర్చిన పండ్లు, పువ్వులు, బంగారం, అద్దాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి అని అన్నారు. ఆ ఏడాది మొత్తం శుభప్రదంగా గడవాలని కోరుకుంటూ చూసే ఆ దృశ్యం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.

4 / 5
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చిన్నప్పటిలా పండుగను జరుపుకోలేకపోతున్నానని, కానీ ఆ పాత రోజులను తలుచుకుంటే ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉంటుందని అనశ్వర అన్నారు. షూటింగ్ లో ఉన్నప్పటికీ, సంప్రదాయబద్ధమైన 'సద్య' (కేరళ విందు భోజనం) తినడం మాత్రం మర్చిపోనని ఆమె చెప్పారు. కేరళ సంప్రదాయ దుస్తులైన కసవు చీర కట్టుకుని, కుటుంబ సభ్యులతో గడపడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆమె వెల్లడించారు.

5 / 5
మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం క్రేజీ బ్యూటీ. ఇటీవలే తెలుగులో ఛాంపియన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని తెలుస్తోంది.

Follow Us