
ఐశ్వర్య లక్ష్మి.. దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె చివరగా థగ్ లైఫ్ చిత్రంలో నటించింది. 2025లో విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పలు సినిమాలకు సైన్ చేసింది. ఇప్పుడు అర్జున్ దాస్ సరసన నటిస్తుంది.

అయితే తెలుగులోనూ ఈ హీరోయిన్ చాలా పాపులర్. తమిళంలో సూపర్ హిట్ అయిన మట్టి కుస్తీ సినిమాను తెలుగులో విడుదల చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2లోనూ నటిస్తుంది. ఈ సందర్భంగా గతంలో ఈ సినిమా గురించి ఐశ్వర్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరవలుతున్నాయి.

మట్టి కుస్తీ సినిమా కథ తనకు మొదటిసారి చెప్పినప్పుడు నటించడానికి అంగీకరించలేదని చెప్పుకొచ్చింది. అందులో నటించడం లేదని నిర్మాతలకు చెప్పానని అన్నారు. ఎందుకంటే తనకు ముందు చెప్పిన కథలో డబుల్ యాక్షన్ ఉందని.. అందుకే తాను ఆ సినిమాను ఒప్పుకోలేదని అన్నారు. Lekshmi Latest

కానీ రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే సినిమాలో నటించానని అన్నారు. సినిమా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఈ ప్రాజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో ఐశ్వర్య లక్ష్మీ కెరీర్ మలుపు తిరిగింది.

ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తమిళ చిత్రం మట్టి కుస్తీ 2లో నటిస్తుంది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. ఆమె తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తుంది.