ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా..

Updated on: Jul 31, 2026 | 2:08 PM

జబర్దస్త్ వేదికపై తనదైన శైలిలో నవ్వులు పంచిన నటుడు, కమెడియన్ అదిరే అభి. ప్రస్తుతం దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు అభి. కాగా తన సుదీర్ఘ కెరీర్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, విజయాలను, అలాగే ఒక కీలకమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తన జబర్దస్త్ కెరీర్ లో  కెరీర్‌లో అత్యంత విజయవంతమైన స్కిట్‌గా KGFని ఆయన పేర్కొన్నారు.

1 / 5
జబర్దస్త్ వేదికపై తనదైన శైలిలో నవ్వులు పంచిన నటుడు, కమెడియన్ అదిరే అభి. ప్రస్తుతం దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు అభి. కాగా తన సుదీర్ఘ కెరీర్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, విజయాలను, అలాగే ఒక కీలకమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తన జబర్దస్త్ కెరీర్ లో  కెరీర్‌లో అత్యంత విజయవంతమైన స్కిట్‌గా KGFని ఆయన పేర్కొన్నారు. "నేను చేసిన అన్ని మాక్సిమం స్కిట్స్ కంటే KGF స్కిట్ బాగా... లాస్ట్ మినిట్లో అంటే లైక్ నేను ఇంకా ఈ కామెడీ స్కిట్స్ నుంచి బయటకు వస్తున్న టైంలో మా టీవీలో చేసిన స్కిట్ అది. అది చాలా మంచి పేరు వచ్చింది మాకు" అని వివరించారు.

2 / 5
ఆ స్కిట్‌లో పంచులు అద్భుతంగా పేలాయని, ఇప్పటికీ అది వైరల్ అవుతోందని తెలిపారు. అభి కేవలం ఒక కమెడియన్‌గా మాత్రమే కాకుండా, తన టీమ్‌లో ఉన్న వారిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. "జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. కానీ మీరు, పర్టిక్యులర్ గా మీరు, జబర్దస్త్ లో చాలా మందికి మీరు లైఫ్ ఇచ్చారు అని చెప్తుంటారు." అనే ప్రశ్నకు బదులిస్తూ, "ఐ ఫీల్ హ్యాపీ అండి. అంటే మన దగ్గర నుంచి వచ్చి, వాళ్ళు మంచి పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు డెఫినేట్ గా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. బయటి నుంచి వస్తే ఆ క్రెడిట్ రాదు కదా మనకు. పైగా వాళ్ళు కూడా గర్వంగానే చెప్తారు" అని అన్నారు.

3 / 5
ఆది, తేజ, నవీన్, ఇమ్మాన్యుయేల్ వంటి వారు ఉన్నత స్థానాలకు చేరుకోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. తేజ కార్పొరేట్ ఎంప్లాయ్ నుంచి  ఫుడ్ వ్లాగర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎదగడం, ఇమ్మాన్యుయేల్ వంటి వారి ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. తన టీమ్ సభ్యులు అందరూ ఎదగాలనే ఉద్దేశంతోనే స్కిట్లను రాసేవారని, ఎవరికి ఏ పాత్ర ఇస్తే బాగుంటుందో ఆలోచించి చేసేవారని వివరించారు.

4 / 5
అభి టీమ్ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కూడా వెల్లడించారు. "కచ్చితంగా ఈ స్కిట్ కొట్టాలి, లేకపోతే, అది మనకు ఒక లో అవుతది కదా, దానివల్ల పేరు పోతుందే, జడ్జెస్ తో పాటు జనాలు కూడా తిడతారు కదా అనేది భయం ఉంటది. సో, కచ్చితంగా ఈసారి స్కిట్ కొట్టాలి, ఒకసారి కొడితే ఈసారి, నెక్స్ట్ కూడా కంటిన్యూ కొట్టాలి, వరుసగా కొట్టాలి, ఇవన్నీ... అది కాంపిటీషన్ డెఫినేట్ గా ఉండేది" అని తెలిపారు.

5 / 5
అభి కెరీర్‌లో ఒక స్కిట్ ద్వారా తీవ్రమైన పశ్చాత్తాపానికి గురైన సంఘటనను కూడా పంచుకున్నారు. "నాకు స్టార్టింగ్ లో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత తెలియకుండా ఒక స్కిట్ చేశాను. ఒక డైరెక్టర్ గారికి చాలా ఇబ్బంది అయింది ఆ స్కిట్ వల్ల. సో, అప్పుడు నేను అనుకున్నాను, మనం నలుగురిని నవ్వించడానికి ఇంకొకరిని తక్కువ చేసి అనేది మనం పెట్టుకోవద్దు. వాళ్ళు నవ్వకపోయినా పర్లేదు, ఇక్కడ వీళ్ళు బాధపడకూడదు" అని ఫిక్స్ అయ్యా.. ఆ దర్శకుడిని ఫేస్ చేయడానికి ఇప్పటికీ తనకు ధైర్యం రాలేదని, తాను వెళ్లి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆ ఘటన పట్ల పశ్చాత్తాపం మాత్రం ఇంకా ఉందని తెలిపారు. 

Loading...
Unable to load recommendations.
Follow Us