
'మన శంకరవరప్రసాద్' సినిమా విజయంలో ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్. ఈ మెగా మూవీలో ఆయన కంపోజ్ చేసిన హుక్ స్టెప్ సాంగ్ ఎలా వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆట షోలో విజేతగా నిలిచిన సందీప్ మాస్టర్ బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక సోషల్ మీడియాలో నిత్యం చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ మెగాభిమానులకు బాగా చేరువయ్యాడీ కొరియోగ్రాఫర్.

ఈ క్రమంలోనే 'మన శంకరవరప్రసాద్' సినిమాలో ఛాన్స్ పట్టేసి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే స్టెప్పులు వేయించాడు సందీప్ మాస్టర్. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

కాగా మన శంకరవరప్రసాద్ గారు కంటే ముందు ఛాంపియన్ సినిమాలో గిర గిర సాంగ్ కు స్టెప్పులు కంపోజ్ చేశాడు సందీప్ మాస్టర్ .ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

అంతకు ముందు సుధీర్ బాబు జటాధర తదితర సినిమాలకు కూడా నృత్య రీతులు సమకూర్చాడు సందీప్ మాస్టర్. ఇదిలా ఉంటే తాజాగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నాడు సందీప్ మాస్టర్.

ప్రస్తుతం శివ మాలలో ఉన్న ఆయన భార్య, పిల్లాడితో కలిసి అరుణాలంవెళ్లారు. అక్కడ స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.