OTT Cinema : మెడికల్ కాలేజీ హాస్టల్ గది రహస్యం.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..

Updated on: Nov 20, 2026 | 9:41 PM

తెలుగు సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ కానుంది. 2020 లాక్‌డౌన్ సమయంలో ఒక మెడికల్ కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, సీల్ చేసిన హాస్టల్ గది గతం వెంటాడే ఒక విద్యార్థి కథను తెలుపుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఐదు భాషలలో అందుబాటులో ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5
హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా ఓ ఆసక్తికరమైన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. 2020 నాటి కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం పేరు '418'. అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత, నవంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. సుమారు 148 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ లభించింది.

2 / 5
 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాలకు దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేసిన కీర్తన్ నాడగౌడ ఈ సినిమాకు కథ, దర్శకత్వం వహించి డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు. వెంకీ జీజీ సంగీతం అందించగా, దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ, ఆకుల్ అవినాష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

3 / 5
తీరప్రాంత కర్ణాటకలోని వేదగిరి మెడికల్ కాలేజీ నేపథ్యంలో కథ నడుస్తుంది. అక్కడి బాయ్స్ హాస్టల్ గతంలో సైకియాట్రిక్ వార్డుగా ఉండేదని, 15 ఏళ్ల క్రితం వరుస హింసాత్మక మరణాల నేపథ్యంలో 418వ గదిని సీల్ చేశారని కథలో చూపిస్తారు. పక్కనే ఉన్న 417వ గదిలోకి మెడికల్ విద్యార్థి వివేక్ (సూర్య రాజ్ వీరభతిని) చేరుతాడు. ఓ తోటి విద్యార్థి సీల్ చేసిన గదిలోకి వెళ్లిన తర్వాత వివేక్‌కు వింత అనుభవాలు, భయానక దృశ్యాలు కనిపిస్తాయి.

4 / 5
15 ఏళ్ల క్రితం విషాదకరమైన గతం ఉన్న దేవిక (చైత్ర జే ఆచార్)తో ఈ సంఘటనలకు సంబంధం ఏమిటి? స్థానిక యక్షగాన జానపద కథలు ఈ భయానక పరిస్థితులను ఎలా వివరిస్తాయి? వైద్యశాస్త్రం, మూఢనమ్మకాల మధ్య సంఘర్షణ ఎలా సాగిందనేది ఆసక్తికరం. ఈ చిత్రంలో వివేక్‌గా సూర్య రాజ్ వీరభతిని, దేవికగా చైత్ర జే ఆచార్ నటించగా.. చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, రమేష్ ఇందిర కీలక పాత్రల్లో కనిపించారు.

5 / 5
థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. లాక్‌డౌన్ వాతావరణం, తొలి అర్ధభాగంలో కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, చైత్ర ఆచార్ నటనపై పలువురు ప్రశంసలు కురిపించగా.. ద్వితీయార్థంలో కథనం కొంత నెమ్మదించిందనే అభిప్రాయాలు వినిపించాయి. రమేష్ ఇందిర కాలేజీ సైకియాట్రిస్ట్‌గా నటించారు. వెంకీ జిజి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ, అకుల్ అవినాష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us