ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..

Updated on: May 18, 2026 | 5:23 PM

నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. ఇక అందులో కొంత మందికి చికెన్ ఇష్టం ఉంటే, మరికొంత మంది మటన్ ఉంటుంది. ముఖ్యంగా కొందరికి చికెన్ లివర్, చికెన్ కర్రీ ఇష్టం ఉంటే, మరికొంత మందికి కోడి కాళ్ల సూప్ ఫేవరెట్. అయితే ఈ కోడి కాళ్ల సూప్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి. అనేక సమస్యలకు ఇది దివ్యౌషధం. కాగా, దీనిని రుచికరంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : కోడి కాళ్లు, ఉల్లిపాయ, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు, నూనె, కొత్తిమీర, పూదీనా, ధనియాల పొడి.

2 / 5
తయారీ విధానం : ముందుగా కోడి కాళ్లు తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రం చేయాలి. గోరు వెచ్చటి నీటిలో పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసి, తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలి. దీని  కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి, దానిపై పాన్ పెట్టి అందులో మూడు కప్పుల నీళ్లు పోసి, మిరియాల పొడి, కోడి కాళ్లు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి, దాదాపు 20 నిమిషాలు కోడి కాళ్లను ఉడకబెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు కోడి కాళ్లు బాగా ఉడికిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో లవంగాలు, అల్లం , పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కోడి కాళ్లు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసి మళ్లీ ఉడకబెట్టుకోవాలి.

4 / 5
కాళ్లు బాగా ఉడికి చిక్కటి రసం రావాలి. అప్పుడు ఇందులో ధనియాల పొడి , గరం మసాలా, కొత్తిమీర, పూదీనా వేసి మరో ఐదు నుంచి పదినిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంతే ఇప్పుడు టేస్టీ టేస్టీ కోడి కాళ్ల రసం రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

5 / 5
కోడి కాళ్లలో కొల్లాజెన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన ఇది చర్మ ఆరోగ్యానికే కాకుండా ఎముకల బలానికి, కీళ్ల ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఇందులో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరానికి చాలా ఎనర్జీ ఇస్తుంది.

Follow Us