
ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ ఎంత ఎక్కువ మద్యం తాగితే అంత గొప్ప అనే ఫీలింగ్‌లో ఉంటున్నారు. దానికి తోడు సిగరెట్ వంటి చెడు అలవాట్లను కూడా నేర్చుకుంటారు. సోషల్ మీడియా ప్రభావంతో స్టైల్‌గా ఉంటందని.. సిగరెట్, మద్యం కలిపి తాగుతూ గొప్పగా ఫీల్ అవుతుంతారు. కానీ అప్పటికీ ఇది సరదాగా అనిపించినా.. మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.

బ్రూచ్‌లాడిచ్ X4 క్వాడ్రపుల్డ్ అనే విస్కీలో మొత్తం ఆల్కహాల్ శాతం 92 శాతం ఉంటుంది. ఈ విస్కీని తయారు చేసేటప్పుడు దీనిని నాలుగు సార్లు స్వేదనం చేస్తారు. ఇది స్టాంగ్ సింగిల్ మాల్ట్ విస్కీ. దీనిని అధిక ఆల్కహాల్ పానీయాలు, జ్యూస్‌లు, నీరు మొదలైన వాటితో తాగాలని చెబుతారు.

ధూమపానం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. మద్యం కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ కాలేయానికి నెమ్మదిగా విషం లాంటిది. అందుకే రెండూ ఒకేసారి తీసుకుంటే శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయడం మానేస్తాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మద్యం, ధూమపానం కలపడం వల్ల శరీరంపై చాలా ఒత్తిడి పడుతుంది. ఆ సమయంలో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అంతేకాకుండా, అదే సమయంలో ధూమపానం చేయడం వల్ల వాయునాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది.

గర్భిణీ స్త్రీలు కూడా మద్యం, ధూమపానం కలిపితే, అది పుట్టబోయే బిడ్డకు చాలా ప్రమాదకరం. లోపల శిశువు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే, శిశువు సరిగ్గా అభివృద్ధి చెందదు. అందుకే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.(Note : నిపుణులు, నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించి సమాచారం మేరకు మాత్రమే ఈ అంశాలను మేము అందించాము. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. వీటిని టీవీ9 దృవీకరింట్లేదు.