అంతులేని నీరసం, అలసటకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి

Updated on: Jul 02, 2026 | 12:18 PM

నీరసం, అలసటగా ఉన్నవాళ్లు కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి తింటే సెట్ అవుతారు. దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా. అంత టేస్టీగా ఉంటుంది. మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  ఒక బీట్రూట్,  రెండు క్యారెట్ లు , ఒక ఉల్లిపాయ , 6 వెల్లుల్లి రెబ్బలు,
8 ఎండు మిర్చి , చిన్న నిమ్మకాయంత చింతపండు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ బెల్లం, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక బీట్రూట్, రెండు క్యారెట్ లు , ఒక ఉల్లిపాయ , 6 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండు మిర్చి , చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ బెల్లం, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5

కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి తాలింపుకు కావాల్సినవి: రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , 
ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ,  ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , రెండు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకులు, కొద్దిగా ఇంగువను తీసుకోవాలి.  తాలింపు పెట్టుకుని తింటే రుచి అదిరిపోతోంది.

కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి తాలింపుకు కావాల్సినవి: రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , రెండు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకులు, కొద్దిగా ఇంగువను తీసుకోవాలి. తాలింపు పెట్టుకుని తింటే రుచి అదిరిపోతోంది.

3 / 5
కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి తయారీ విధానం: ముందుగా  బీట్రూట్, క్యారెట్‌ను తీసుకుని బాగా  కడిగి  చిన్న చిన్న  ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో ఆయిల్ లో వేసి బీట్రూట్, క్యారెట్, కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి  మీడియం మంటపై వీటిని బాగా కాల్చుకోవాలి. కాలే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి.

4 / 5

కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 : మళ్ళీ అదే పాన్‌లోనాలుగు ఎండు మిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ధనియాలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి. చింతపండును తీసుకుని కనీసం ఐదు నిమిషాలు పాటు వెచ్చని నీటిలో బాగా నానాబెట్టుకోవాలి. ఆ తరువాత గుజ్జు తీసుకోవాలి.

5 / 5
కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి తయారీ విధానం స్టెప్ 2 : ఇది బాగా చల్లారిన తర్వాత  బీట్రూట్, క్యారెట్, మసాలాలు, వెల్లుల్లి, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం కూడా దీనిలో కలిపి మిక్సీలో మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. 
అవసరమైతే దీనిలో కొద్దిగా నీరు వేసి పచ్చడిలా చేసుకోవాలి చివర్లో పోపు వేసి వడ్డించుకుని తినడమే.

కాల్చిన బీట్రూట్ క్యారెట్ పచ్చడి తయారీ విధానం స్టెప్ 2 : ఇది బాగా చల్లారిన తర్వాత బీట్రూట్, క్యారెట్, మసాలాలు, వెల్లుల్లి, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం కూడా దీనిలో కలిపి మిక్సీలో మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. అవసరమైతే దీనిలో కొద్దిగా నీరు వేసి పచ్చడిలా చేసుకోవాలి చివర్లో పోపు వేసి వడ్డించుకుని తినడమే.

Follow Us