
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: యాలకులను నీటిలో నానబెట్టి లేదా మరిగించి తాగడం వల్ల జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను అరికడుతుంది.

పొట్ట కొవ్వు, బరువు నియంత్రణ: పొత్తికడుపు భాగంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో యాలకుల నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో మెటబాలిజం రేటును పెంచి వేగంగా క్యాలరీలను కరిగించడంలో సాయపడుతుంది, తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డ్రింక్.

నోటి దుర్వాసనకు చెక్: యాలకులలో సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా, పంటిపై ప్లాక్ పేరుకుపోవడం తగ్గుతాయి. నోటి దుర్వాసన దూరమై రోజంతా నోరు తాజా గా ఉంటుంది.

రక్తపోటు, కొలెస్ట్రాల్ నివారణ: క్రమం తప్పకుండా యాలకుల నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే, రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గింపు: యాలకుల సువాసన, అందులోని పోషకాలు నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. రోజు ప్రారంభంలోనే ఈ నీటిని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది.