
చాలా మంది రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెబుతుంటారు. ఎటువంటి నొప్పి, బాధ లేదా లక్షణాలు లేకుండానే మానవ ప్రాణాలను తీసుకువెళ్ళే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో సంభవించే మరణాలలో బీపీ, గుండె సంబంధిత సమస్యల వల్ల సుమారు 20-25% మంది మరణిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కిడ్నీల వైఫల్యం, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజ్‌లు, పక్షవాతం వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు అధిక రక్తపోటు ప్రధాన కారణం.

2021 అక్టోబరు నుండి 2022 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన 50,10,708 మందిపై వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం, వారిలో 31% మందికి బీపీ ఉన్నట్లు తేలింది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ బీపీ ఉన్నవారిలో 80% మందికి రక్తపోటు నియంత్రణలో లేదని ఆ సర్వే వెల్లడించింది. చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేనందున, తమకు బీపీ ఉందని కూడా తెలుసుకోవడం లేదని చెబుతున్నారు. దీని వలన 20 లేదా 25 ఏళ్లు పైబడిన వారంతా కనీసం ఒక్కసారైనా బీపీని చెక్ చేయించుకోవడం మంచిదని అంటున్నారు.

మొదటి దశ అధిక రక్తపోటు అంటే సిస్టోలిక్ రీడింగ్ (పై భాగం) 130-139 మధ్య, డయాస్టోలిక్ రీడింగ్ (కింది భాగం) 80-89 మధ్య ఉండటం. ఇలాంటి సందర్భాలలో వెంటనే మందులు వాడకుండా సహజ పద్ధతుల ద్వారా బీపీని నియంత్రించవచ్చని అని చెబుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన యాలుక పొడి అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు.

ఒక అధ్యయనంలో, కొత్తగా బీపీ నిర్ధారణ అయిన 20 మంది రోగులను ఎంపిక చేసుకున్నారు. వీరికి ఎలాంటి ఇంగ్లీష్ మందులు గానీ, ఆహార మార్పులు గానీ చేయకుండా, కేవలం ప్రతిరోజూ ఉదయం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాముల యాలుక పొడిని ఇచ్చారు. రెండు నుండి మూడు నెలల్లోపే ఈ 20 మంది రోగుల సిస్టోలిక్ బీపీ 116కి, డయాస్టోలిక్ బీపీ 78కి తగ్గిందని ఆ అధ్యయనం నిరూపించింది. ఇది కేవలం యాలుక పొడి వాడకం వల్లనే సాధ్యమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

యాలుక పొడి బీపీని తగ్గించడమే కాకుండా, శరీరంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను 90% వరకు పెంచుతుందని కూడా ఆ అధ్యయనం తెలిపింది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షిస్తాయి, వాపులను తగ్గిస్తాయి, వ్యర్థాలను, రసాయనాలను, విష పదార్థాలను, ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి. శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే యాంటీఆక్సిడెంట్ల స్థాయి పెరగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.