కొత్త లోన్‌ తీసుకోవాలా? ఉన్న లోన్‌పై టాప్‌ అప్‌ తీసుకోవాలా? ఏది లాభదాయకం!

Updated on: May 12, 2026 | 8:46 PM

అత్యవసర ఖర్చులకు, వ్యాపార విస్తరణకు అదనపు డబ్బు కావాలా? టాప్-అప్ లోన్ సరైన పరిష్కారం. ఇది మీ ప్రస్తుత రుణంపై బ్యాంకులు అందించే అదనపు రుణం. తక్కువ వడ్డీ రేట్లు, వేగవంతమైన ఆమోద ప్రక్రియతో ఇది ప్రజాదరణ పొందుతోంది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

1 / 5
అత్యవసర ఖర్చులు, ఇంటి మరమ్మతులు, పిల్లల విద్య, వైద్య అవసరాలు లేదా వ్యాపార విస్తరణ వంటి పరిస్థితుల్లో చాలా మందికి అదనపు డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో కొత్త రుణం కోసం తిరిగి దరఖాస్తు చేయడం కంటే, ఇప్పటికే తీసుకున్న రుణంపైనే టాప్-అప్ లోన్ తీసుకోవడం ఇప్పుడు ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. తక్కువ వడ్డీ, వేగవంతమైన ఆమోదం కారణంగా ఈ రుణాలు ప్రజాదరణ పొందుతున్నాయి.

2 / 5
టాప్-అప్ లోన్ అంటే ఇప్పటికే హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఇతర రుణం తీసుకుని, సమయానికి ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అదనంగా ఇచ్చే రుణం. ఇది కొత్త రుణం కాకుండా, ప్రస్తుత రుణానికి అనుబంధంగా ఉంటుంది. ముఖ్యంగా రుణగ్రహీత గత చెల్లింపుల్లో ఎలాంటి డిఫాల్ట్ చేయకపోతే, బ్యాంకులు సులభంగా ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.

3 / 5
టాప్-అప్ రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు రుణగ్రహీత చెల్లింపు చరిత్ర, ఆదాయ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, ప్రస్తుత బకాయి వంటి అంశాలను పరిశీలిస్తాయి. ఇప్పటికే కస్టమర్ వివరాలు తమ వద్ద ఉండటం వల్ల ఆమోద ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ రుణాన్ని కూడా ఈఎంఐల రూపంలోనే తిరిగి చెల్లించాలి.

4 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం అసురక్షిత వ్యక్తిగత రుణాలతో పోలిస్తే టాప్-అప్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే అత్యవసర అవసరాల సమయంలో ఇది ప్రయోజనకరమైన ఎంపికగా భావిస్తున్నారు. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం ఉన్నవారు, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారు మాత్రమే ఈ రుణాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

5 / 5
అయితే టాప్-అప్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, కాలపరిమితి, మొత్తం చెల్లించాల్సిన భారం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. EMI తక్కువగా కనిపించినా, కాలపరిమితి పెరిగితే మొత్తం వడ్డీ భారం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక నిపుణులు చెబుతున్నదేమిటంటే, అవసరానికి మాత్రమే రుణం తీసుకుని, ముందుగానే తిరిగి చెల్లింపు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే టాప్-అప్ లోన్లు ఉపయోగకరమైన ఆర్థిక సాధనంగా మారవచ్చు.

Follow Us