Silver Prices: కుప్పకూలుతున్న వెండి ధరలు.. ఏకంగా రూ.2 లక్షలు డౌన్.. త్వరలో మరింత పతనం..!

Updated on: Nov 01, 2026 | 10:52 AM

సిల్వర్ ధరలు భారీగా పడిపోతున్నాయి. జనవరిలో నమోదైన గరిష్ట స్థాయితో పోలిస్తే మరింతగా కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం, పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ కూడా తగ్గడంతో సిల్వర్ ధరలు పతనమవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశముందని అంటున్నారు.

1 / 5
దీపావళి వస్తున్న క్రమంలో బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. బంగారం బాటలోనే సిల్వర్ ధరలు కూడా పతనమవుతున్నాయి. దీపావళికి పూజా సామాగ్రి, దేవుడి ప్రతిమలు, ఇంట్లో పాత్రల రూపంలో సిల్వర్ చాలామంది కొంటూ ఉంటారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా రానున్న క్రమంలో మెట్టెలకు డిమాండ్ పెరగనుంది. ఈ సమయంలో సిల్వర్ ధరలు రోజురోజుకి పడిపోతుండటం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు

2 / 5
ఈ ఏడాది జనవరిలో కిలో వెండి ఏకంగా రూ.4 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత నుంచి ధరలు దిగజారుతూ ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. నవంబర్ 1 నాటికి కేజీ వెండి ధర రూ.2 లక్షల వద్ద కొనసాగుతోంది. అంటే గరిష్ట స్థాయితో పోలిస్తే ఏకంగా కొన్ని నెలల కాలంలోనే రూ.2 లక్షల మేర పడిపోయింది. ఇది భారీ తగ్గుదలకు చెప్పవచ్చు. అక్టోబర్ 31న ఏకంగా రూ.10 వేలు ఒకేసారి తగ్గింది.

3 / 5
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పసిడి ధరలు పడిపోతున్నాయి. యుద్ద పరిస్థితుల క్రమంలో గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 110 డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ద్రవ్యోల్బణానికి అరికట్టేందుకు యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. గత నెలలో వడ్డీ రేట్లను స్ధిరంగా ఉంచింది. దీంతో వడ్డీ రేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రభావం వెండి ధరలపై పడుతుంది.

4 / 5
ఆర్టీపీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు గోల్డ్, సిల్వర్‌ను విక్రయిస్తుండటంతో అమ్మకాలు ఒత్తిడి పెరిగింది. ఏఐ వల్ల ఎలక్ట్రానిక్ రంగం నుంచి సిల్వర్‌కు డిమాండ్ తగ్గవచ్చనే అంచనాలు వస్తున్నాయి. సిల్వర్ ధరల పతనానికి ఇది ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. వెండిని పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో పారిశ్రామిక రంగం నుంచి కూడా డిమాండ్ తగ్గింది.

5 / 5
ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉంది. దీని వల్ల రాబోయే కొద్ది రోజుల్లో వెండి మరింతగా తగ్గవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివిధ దేశాల్లో వెండి నిల్వలు కూడా పెరుగుతుండటంతో.. ఆ లోహానికి డిమాండ్ తగ్గింది. 2025 అక్టోబర్ నిల్వలతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us